Site icon Prime9

Grammy Awards 2023: రిక్కీ కేజ్.. మూడు గ్రామీ అవార్డులు అందుకున్న ఏకైక భారతీయుడు

grammy Awards 2023

grammy Awards 2023

Grammy Awards 2023: లాస్‌ ఏంజెల్స్‌లో ప్రఖ్యాత 65వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఈరోజు వైభవంగా జరిగింది.

కాగా ఈ అవార్డు వేడుకలో భారత్‌కు చెందిన రిక్కీ కేజ్‌ ‘డివైన్‌ టైడ్స్‌’ ఆల్బమ్‌కు గానూ బెస్ట్‌ ఇమ్మర్సివ్‌ ఆడియో ఆల్బమ్‌ అవార్డు అందుకున్నారు.

ఆయన అంతకు ముందు 2015, 2022లోనూ గ్రామీ అవార్డుల(Grammy Awards 2023)ను కైవసం చేసుకున్నారు. దీంతో మూడు గ్రామీ అవార్డులు అందుకున్న ఏకైక భారతీయుడుగా కేజ్‌ రికార్డు సృష్టించారు.

1981లో నార్త్ కరోలినాలో ఈయన జన్మించారు.

కేజ్ పంజాబీ, మార్వాడీకి చెందిన వాడు.

ricky kej

ఎనిమిదేండ్ల వయస్సు నుంచి ఆయన బెంగళూరు లోనే నివసిస్తున్నాడు.

ఇక మూడోసారి కూడా అవార్డు అందుకోవడం పట్ల రిక్కీ ట్విట్టర్ వేదికగా తాజాగా స్పందించారు.

‘ఇప్పుడే నా 3వ గ్రామీ అవార్డును గెలుచుకున్నాను. చాలా కృతజ్ఞతలు, ఈ ఆనందంలో నేను మాట్లాడలేకపోతున్నాను.

ఈ అవార్డును భారతదేశానికి అంకితం చేస్తున్నాను.. అంటూ రాసుకొచ్చాడు.

భారతదేశం నుండి గ్రామీ అవార్డును గెలుచుకున్న రిక్కీ అంతర్జాతీయంగా విడుదలైన 16 స్టూడియో ఆల్బమ్‌ కు పనిచేశారు.

అలానే దాదాపు 3500కి పైగా వాణిజ్య ప్రకటనలకు పని చేశారు.

సర్ డేవిడ్ అటెన్‌బరోకు చెందిన నేచురల్ హిస్టరీ డాక్యుమెంటరీ ‘వైల్డ్ కర్ణాటక’తో సహా 4 చలన చిత్రాలకు కూడా పని చేసినట్లు సమాచారం అందుతుంది.

ఈ మేరకు ఆయన అభిమనులంతా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ అభినందనలు తెలుపుతున్నారు.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఏడాది గ్రామీ విజేతల వివరాలు..

బెస్ట్‌ ఇమ్మర్సివ్‌ ఆడియో ఆల్బమ్‌: రిక్కీ కేజ్‌, బెస్ట్‌ పాప్‌ డ్యుయో పర్ఫామెన్స్‌ – సామ్‌ స్మిత్‌, కిమ్‌ పెట్రాస్‌

సాంగ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ : బోనీ రైట్‌

బెస్ట్‌ డ్యాన్స్‌/ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌: రెనిసాన్స్‌(బియాన్స్‌), బెస్ట్‌ పాప్‌ సోలో పర్ఫామెన్స్‌: అదెలె, బెస్ట్‌ ర్యాప్‌ ఆల్బమ్‌: కెన్‌డ్రిక్‌ లామర్‌ (మిస్టర్‌ మొరాలే, బిగ్‌ స్టెప్పర్స్‌), బెస్ట్‌ మ్యూజిక్‌ అర్బన్‌ ఆల్బమ్‌: బ్యాడ్‌ బన్నీస్‌ అన్‌ వెరానో సిన్‌టి

బెస్ట్‌ కంట్రీ ఆల్బమ్‌ విన్నర్‌: ఎ బ్యూటిఫుల్‌ టైమ్‌, బెస్ట్‌ ఆర్‌ అండ్‌ బి సాంగ్‌: కఫ్‌ ఇట్‌ (బియాన్స్‌), బెస్ట్‌ పాప్‌ వోకల్‌ ఆల్బమ్‌: హ్యారీ స్టైల్స్‌

ఇదిలా ఉంటే ఇప్పటివరకు అత్యధికంగా 31 గ్రామీ అవార్డులు పొందిన సెలబ్రిటీగా జార్జ్‌ సాల్టి ఉండేది.

తాజాగా ఇప్పుడు ఆమె రికార్డును అమెరికన్‌ సింగర్‌, డ్యాన్సర్‌ బియాన్స్‌ 32 అవార్డులతో ఆ రికార్డును బద్ధలు కొట్టింది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version