Site icon Prime9

The Avatar 2 new trailer : అవతార్ 2 ఫైనల్ ట్రైలర్ రిలీజ్

Avatar The Way of Water New Trailer

Avatar 2: సైన్స్ ఫిక్షన్ చిత్రం అవతార్: ది వే ఆఫ్ వాటర్ డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు వారాల క్రితం, మొదటి ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఇది సినిమా అభిమానులను మరో ప్రపంచంలోకి తీసుకు వెళ్లింది. ఇపుడు తాజాగా ఈ చిత్రం యొక్క రెండవ ట్రైలర్ ను విడుదల చేసారు. మొదటి చిత్రం యొక్క సంఘటనల తర్వాత 13 సంవత్సరాల తర్వాత ఫ్రాంచైజీ వస్తోంది.

అవతార్: ది వే ఆఫ్ వాటర్ సుల్లీ కుటుంబం (జేక్, నేయిత్రి మరియు వారి పిల్లలు), వారిని అనుసరించే ఇబ్బందులు, ఒకరినొకరు సురక్షితంగా ఉంచుకోవడానికి వారు పడుతున్న శ్రమలు, సజీవంగా ఉండటానికి వారు చేసే యుద్ధాలు మరియు వారు అనుభవించే విషాదాలతో ఉంటుంది. జేక్ పాత్రను సామ్ వర్తింగ్టన్ పోషించగా నేయిత్రి పాత్రలో జోయ్ సల్దండా తన దైన శైలిలో నటించారు.

తాజా ట్రైలర్ పండోర యొక్క సముద్ర జీవితానికి సంబంధించిన అద్భుతమైన విజువల్స్‌తో నిండి ఉంది ఈ ట్రైలర్ మునుపటి ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. రెండు నిమిషాల ట్రైలర్ మనోహరంగా ఉంది, ఉత్కంఠభరితంగా ఉంది. ఈ చిత్రాన్ని పెద్ద స్క్రీన్‌పై ఎప్పడు చూస్తామా అనే రీతిలో వేచి ఉండేలా చేస్తుంది. రస్సెల్ కార్పెంటర్ యొక్క అద్భుతమైన విజువల్స్ మరియు సైమన్ ఫ్రాగ్లెన్ సంగీతం మనల్ని అవతార్: ది వే ఆఫ్ వాటర్ ప్రపంచంలోకి తీసుకు వెడుతుంది. డిసెంబర్ 16న, అవతార్: ది వే ఆఫ్ వాటర్ థియేటర్‌లలో తుఫాను సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఇండియాలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

Exit mobile version