Thandel: అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తండేల్. బన్నీవాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. చాలా గ్యాప్ తరువాత చైకు మంచి హిట్ అందింది. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన తండేల్.. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా కలక్షన్స్ రాబట్టి రికార్డులు సృష్టించింది.
ఇక తండేల్ సినిమా వచ్చి నెల అవుతుంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మార్చి 7 న తండేల్ ఓటీటీలో రిలీజ్ కానుంది.ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో తండేల్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఇక ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించడంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. ఈ సినిమా నుంచి ఒక్కో వీడియో సాంగ్ ను రిలీజ్ చేస్తూ మరింత హైప్ పెంచుతున్నారు.
Meenakshi Chaudhary: రాణిగారికి రాజుగారు భలే సర్ ప్రైజ్ ఇచ్చారే..
ఇప్పటికే బుజ్జితల్లి వీడియో సాంగ్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా సెన్సేషన్ సాంగ్ హైలెస్సో.. హైలెస్సా వీడియోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ అయిన దగ్గరనుంచి సాయిపల్లవి స్టెప్ ను రీల్ చేయని అమ్మాయిలు లేరు అంటే అతిశయోక్తి కాదు. అలా సోషల్ మీడియాను షేక్ చేసిన ఆ స్టెప్ ఫుల్ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
దాదాపు 9 నెలలు సముద్రంలో ఉండి.. మూడు నెలలు కుటుంబంతో గడపడానికి వచ్చిన హీరో.. తన ప్రేయసి అయిన హీరోయిన్ తో ఎలా సమయాన్ని గడిపాడు.. ? వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ భావాలను ఎలా తెలుపుకున్నారు అనేది ఈ సాంగ్ లో చూపించారు. శ్రీమణి అందించిన లిరిక్స్ ఒక ఎత్తు అయితే.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో నజీజ్ ఆకాష్, శ్రేయా ఘోషల్ వాయిస్ మరో ఎత్తు అని చెప్పాలి.
ఇక తండేల్ రాజుగా చై.. సత్య అలియాస్ బుజ్జితల్లిగా సాయిపల్లవి నటన సినిమా మొత్తానికి హైలైట్ అని చెప్పుకోవాలి. ఇప్పటివరకు చై లోని క్లాస్ యాక్టింగ్ ను చూసిన ఫ్యాన్స్ ఇందులో చై నట విశ్వరూపాన్ని చూసారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి థియేటర్ లో అదరగొట్టిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.