Prime9

Gruhalakshmi: అక్టోబర్ 28 ఎపిసోడ్ లో తులసిని ఘోరంగా అవమానించిన నందు!

Gruhalakshmi Today: నేటి  గృహలక్ష్మీ  ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్. నేను ఎక్కడ పడ్డాను. నీ  కౌగిట్లోనా? అని నందు అంటే, కాదు నా ఒళ్లో అని కోపంగా తులసి  అంటుంది. అసలు ఈ సీరియల్ పేరు ఏంటి  వీళ్లు  మాట్లాడుకుంటున్న మాటలు ఏంటని? సీరియల్ కథలోకి వెళ్ళకుండా ఈ బజారు పంచాయితీ ఏంటి అనేట్టుగా సాగుతుంది వీళ్ల మధ్య డిస్కషన్. ఈ సీనులో వీరిద్దరూ బజారు వాళ్లలాగే ప్రవర్తిస్తారు. బురదలో కాలు పెట్టి, మట్టి అంటలేదంటే ఎలా తులసీ అని అనసూయ అందుకుంటుంది. మన మనసు పవిత్రంగా ఉంటే, మన ఆలోచనలు కూడా పవిత్రంగానే ఉంటాయి. నేను బురదలో కాలు పెట్టలేదని తులసి అంటుంది. ఔనా?? ఐతే నువ్వు ఏమో సామ్రాట్‌కి జ్వరం అంటున్నావ్. మరి అతనితో ఈ చిందులు ఏంటి? ఈ డ్యాన్సులు ఏంటి ? ఆ వీడియో ఏంటి? అని లాస్య గుచ్చి గుచ్చి అడుగుతుంది.

మేం వెళ్ళక ముందే అక్కడ పార్టీ జరగుతుంది. అక్కడ ఉన్న పిల్లలు మమ్మలని బలవంతం చేయడంతో ఇంక తప్పక డాన్స్ చేశాం. పైగా ఇద్దరు పిల్లలు అక్కడ ప్రపోజ్ చేసుకున్నారు’ అని తులసి అంటుంది. ఓహో ఇది కూడా ఉందా? మీ మధ్య ప్రపోజల్ కూడా ఐపోయిందన్న మాట. నువ్వు చెప్పే దాని బట్టి చూస్తుంటే ఫస్ట్ నైట్ కూడా అయిపోయి ఉండాలే, మరి పెళ్లి ఎప్పుడు? చెప్పు చెప్పు నాకు చాలా ఇంట్రస్టింగ్‌గా ఉందని వెటకారం చేస్తాడు నందు. ఆ మాటతో అమ్మ కొడుకు ప్రేమ్‌కి బాగా కోపం వస్తుంది. ఆపు మిస్టర్ నందగోపాల్ కోపంగా అని అంటాడు. ‘నువ్వు నోరు మూసుకోరా, డాడ్ మాట్లాడినా దానిలో ఏం తప్పు లేదు. తరువాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

Exit mobile version
Skip to toolbar