Prime9

Thalapathy Vijay : హీరో దళపతి విజయ్ విడాకులు తీసుకుంటున్నాడా ?

Thalapathy Vijay : గత కొన్ని రోజులుగా తమిళ సూపర్ స్టార్ విజయ్ మరియు అతని భార్య సంగీత విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్ యొక్క వికీపీడియా పేజీ అతను తన భార్య నుండి విడిపోయానని మరియు త్వరలో ఆమెకు విడాకులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు పేర్కొనడంతో ఇదంతా ప్రారంభమైంది.

దర్శకుడు అట్లీ భార్య ప్రియ బేబీ షవర్ ఈవెంట్‌లో మరియు వారిసు ఆడియో లాంచ్ ఈవెంట్‌లో సంగీత గైర్హాజరు కావడంతో ఈ వీరిద్దరి మధ్య దూరం పెరిగిందన్న వదంతులు ఎక్కువయ్యాయి.ఈ రూమర్స్ పీక్ స్టేజ్ కి చేరుకోవడంతో విజయ్ సన్నిహిత వర్గాలు క్లారిటీ ఇచ్చారు. ఇవి కేవలం నిరాధారమైన పుకార్లు. ఈ వార్తల్లో నిజం లేదు. సంగీత ప్రస్తుతం అమెరికాలో తన పిల్లలతో హాలిడేస్ లో ఉన్నారని అందుకే ఆమె ఇటీవలి ఈవెంట్‌లకు హాజరు కాలేకపోయిందని వారు పేర్కొన్నారు.

ఈ పుకార్లపై విజయ్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానున్న తన రాబోయే చిత్రం వారిసు ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు.విజయ్ మరియు సంగీత 1996లో కలుసుకున్నారు. మూడు సంవత్సరాల తరువాత ఆగష్టు 25, 1999న వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు జాసన్ మరియు దివ్య ఉన్నారు.

Exit mobile version
Skip to toolbar