Site icon Prime9

Erra Cheera: ఘనంగా “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమా గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్!

Erra Cheera

Erra Cheera

Erra Cheera: బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర – ది బిగినింగ్”. ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. “ఎర్రచీర – ది బిగినింగ్” మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. డిసెంబర్ 20న “ఎర్రచీర – ది బిగినింగ్” తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈరోజు సినిమా గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలోదర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమా గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఉంది. హారర్, దేవుడు కాన్సెప్ట్ లతో సినిమాలు చేయడం ఈ మధ్య ట్రెండ్ గా మారింది. ఈ సినిమా కూడా ఆ ట్రెండ్ లోనే వస్తుందని అనుకోవచ్చు. అయితే ఇంకా డిఫరెంట్‌‌గా ఈ మూవీని రూపొందించారు. బేబి సాయి తేజస్విని ముఖ్యపాత్రలో నటించింది. ఇండస్ట్రీకి కొత్త వాళ్లు రావాలి. అప్పుడే కొత్త టాలెంట్ మనకు దొరుకుతుంది. ఎర్రచీర సినిమా విజయం సాధించి ఈ టీమ్ అందరికీ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.

చిత్ర దర్శక నిర్మాత, నటుడు సుమన్ బాబు మాట్లాడుతూ “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమా గ్లింప్స్ ను ఈ రోజు కార్తీకమాసం పర్వదినం సందర్భంగా ఈ పెద్దల చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. యాక్షన్, మదర్ సెంటిమెంట్ తో ఈ సినిమాను రూపొందించాను. సినిమాలోని 22 పాత్రలతో పాటు ఎర్రచీర కూడా 23వ పాత్ర పోషిస్తుంది. మొత్తం 45 నిమిషాలు గ్రాఫిక్స్ ఉంటాయి. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాం. బేబి సాయితేజస్విని నటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ కథలో డివోషనల్ టచ్ కూడా ఉంటుంది. డిసెంబర్ 20వ తేదీన తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమాను విడుదల చేయబోతున్నాం. మరిన్ని ప్రెస్ మీట్స్ లో ఇంకా డీటెయిల్డ్ గా మూవీ హైలైట్స్ తెలియజేస్తాను. అన్నారు.

హీరోయిన్ కారుణ్య చౌదరి మట్లాడుతూ – “ఎర్రచీర – ది బిగినింగ్” గ్లింప్స్ లో హర హర మహాదేవా అని వచ్చినప్పుడు అందరికీ గూస్ బంప్స్ వచ్చాయి. ఈ గ్లింప్స్ మీతో పాటు నేను కూడా ఇప్పుడే చూస్తున్నాం. మా టీమ్ క్వాలిటీ మూవీ చేసేందుకు ఎంత కష్టపడ్డారో మీకు ఈ గ్లింప్స్ లోనే తెలుస్తుంది. బేబి సాయి తేజస్విని చక్కగా నటించింది. మూవీలో ఆమెకు నాకు మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. కథలో మదర్ సెంటిమెంట్ ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమా చూసిన వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటారు. మా “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమాను మీరంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత అంబికా కృష్ణ మాట్లాడుతూ – “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమా గ్లింప్స్ చాలా బాగుంది. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం. ఈరోజు ట్రెండ్ ప్రకారం ప్రేక్షకులకు కావాల్సిన కంటెంట్ ఉన్న చిత్రమిది. మదర్ సెంటిమెంట్ ను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. సుమన్ బాబు, అతని టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ప్రమోద్ పులిగార్ల మాట్లాడుతూ – “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన సుమన్ బాబు గారికి థ్యాంక్స్. ఆయన నాకు గత పదేళ్లుగా తెలుసు. నేను చక్రి గారి దగ్గర వర్క్ చేశాను. నా ప్రతి సినిమా మొదటి సినిమాలాగే పనిచేయడం నేర్చుకున్నా. “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమాకు డిఫరెంట్ గా పాటలు చేసే అవకాశం దొరికింది. డిసెంబర్ 20న రిలీజ్ అవుతున్న మా సినిమాను థియేటర్స్ లో చూసి ఆదరించండని అన్నారు.

నిర్మాత గురురాజ్ మాట్లాడుతూ  “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేశాను. అయితే అది ఏంటి అనేది ప్రస్తుతానికి సీక్రెట్ గా ఉంచుతున్నాం. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ తో తీసిన చిత్రమిది. సుమన్ బాబుకు ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.

Exit mobile version