ED Notice To Tollywood Super Star Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. తాజాగా, ఆయనకు ఈడీ నోటీసులు పంపింది. రియల్ ఎస్టేట్ సంస్థలు సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో ఈనెల 28వ తేదీన విచారణకు హాజరుకావాలని జారీ చేసిన నోటీసుల్లో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. సోమవారం ఉదయం 10.30 నిమిషాలకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు.
కాగా, రియల్ ఎస్టేట్ సంస్థలు సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలు ఒకే భూమిని వివిధ వ్యక్తులకు విక్రయించి మోసం చేసినట్లు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇటీవల చేసిన విచారణలో తేలింది. అయితే ఈ సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలకు మహేశ్ బాబు ప్రమోషన్స్ చేశారు. ఇందు కోసం ఆయన రూ.3.4 కోట్లు సైతం తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. అయితే కంపెనీల నుంచి రూ.3.4 కోట్లను చెక్ రూపంలో తీసుకోగా.. రూ.2.5కోట్లు నగదు రూపంలో ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. ఇలా మొత్తం రూ.5కోట్ల 90 లక్షలు మహేశ్ బాబు తీసుకున్నారు.
ఇందులో భాగంగానే, వివిధ వ్యక్తులు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబర్చారు. మహేశ్ బాబు ప్రచారకర్తగా ఉండడంతో ఇది చూసిన సామాన్యులు ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యారని ఈడీ ఆయనపై అభియోగం మోపింది. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.