Site icon Prime9

Deputy CM Pawan Kalyan: ఏ హీరోతోనూ పోటీ పడను..ఆ హీరోలంతా నిష్ణాతులే

Deputy CM Pawan Kalyan Speech about tollywood heros in palle panduga: సినిమా పరిశ్రమలో ఏ హీరోతోనూ నేను పోటీపడనని, తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో పల్లె పండుగ వారోత్సవాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సినిమా అంటే నాకు చాలా గౌరవమని, ఏ హీరోతోనూ ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. \

బాలకృష్ణ, చిరంజీవి, మహేష్ బాబు, తారఖ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాని వంటి హీరోలంతా నిష్ణాతులేనన్నారు. సినిమా హీరోలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నట్లు పవన్ చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో జరుగుతున్న పల్లె పండుగ వారోత్సవాల సందర్బంగా పవన్ కల్యాణ్ ప్రసంగిస్తుండగా.. కొంతమంది అభిమానులు ఓజీ సినిమా గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముందు రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం.. అది మన బాధ్యత అని, ఆ తర్వాత సినిమాలు చేయాలని పవన్ కల్యాణ్ అన్నారు.

ఇక, మీరంతా ఓజీ..ఓజీ అంటుంటే నాకు మొదట్లో మోదీ..మోదీ అని వినిపించేదని వెడించారు. అందుకే ముందస్తుగా మన రోడ్లు, బడులు బాగు చేసుకుందామని పిలుపునిచ్చారు. ఆ తర్వాత మీరు విందులంటారా.. ఓజీ అంటారా.. అన్ని పూర్తి చేద్దామని పవన్ తన అభిమానులకు నచ్చజెప్పారు.

Exit mobile version
Skip to toolbar