Prime9

Deepika Padukone: నీ శరీరం.. నీ ఇష్టం అన్నాడు – తల్లి అవ్వడంపై దీపికా ఆసక్తికర కామెంట్స్‌

Deepika Padukone Shared Her Pregnancy Experience: బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ దీపికా పదుకొనె ప్రస్తుతం మాతృత్వ క్షణాలను ఆస్వాధిస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో రణ్‌వీర్‌-దీపిక దంపతులు పండంటి ఆడపిడ్డకు జన్మినిచ్చారు. పాపకు దువా అని నామకరణం చేశారు. అయితే బిడ్డ పుట్టిన రెండు నెలల తర్వాత ఈ పేరు ప్రకటించారు. ఇక తల్లయినప్పటి నుంచి సినిమాకు పక్కన పెట్టిన కూతురు ఆలనాపాలన చూసుకుంటోంది దీపికా. త్వరలోనే కల్కి 2 సినిమాతో రీఎంట్రీ ఇవ్వనుంది.

 

ప్రస్తుతానికి నటికి కెరీర్ పక్కన పెట్టి.. కూతురు ‘దువా’ బాధ్యతను చూసుకుంటూ తల్లిగా బిజీ అయిపోయింది. కూతురు పుట్టి సుమారు తొమ్మిది నెలల అవుతోంది. ఇప్పటి వరకు బయటకు దీపికా తాజాగా ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రెగ్నెన్సీ, మాతృత్వం గురించి చెప్పుకొచ్చింది. పిల్లలను ఎప్పుడు కనాలి అనేది అది ఆడవాల్ల నిర్ణయమే అని చెప్పింది. ఈ విషయంలో తన భర్త రణ్‌వీర్‌ సింగ్‌ ఎంతో సపోర్టు ఇచ్చారని చెప్పింది.

 

“మా పెళ్లయిన కొత్తలో ఒకసారి రణ్‌వీర్‌తో పిల్లలను కనడం గురించి మాట్లాడాను.. బేబీని ఎప్పుడు ప్లాన్‌ చేద్దామని తన అభిప్రాయాన్ని అడిగా. దానికి రణ్‌వీర్‌ సమాధానం ఇస్తూ ఇలా అన్నాడు. ‘పిల్లలను కనడం ఇద్దరి నిర్ణయమే అయినా.. బిడ్డను మోయాల్సింది నువ్వు మాత్రమే. నీ శరీరంలోనే బేబీ పెరుగుతుంద. కాబట్టి ఆ నిర్ణయం నువ్వు తీసుకో. బిడ్డను కనగలనని నీకు ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడే ప్లాన్‌ చేద్దాం’ అన్నారు. అప్పుడు ఆయన మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. ఆ టైంలో నా భర్తను చూస్తే గర్వంగా అనిపించింది” అని చెప్పుకొచ్చింది.

 

ఇక తమ కూతురికి దువా పేరు పెట్టడానికి కారణమేంటో రివీల్‌ చేసింది. “బేబీకి పేరు పెట్టే విషయంలో మేం తొందరపడలేదు. బిడ్డ పుట్టిన రెండు నెలల తర్వాత పేరు పెట్టాం. ఎందుకంటే ముందు బిడ్డ క్షేమంగా మా చేతుల్లోకి రావాలనే మాత్రమే మేం కోరుకున్నం. దువా పేరును కూడా రెండు నెలల తర్వాత ప్రకటించాం. పేరు కూడా అనుకోకుండ పెట్టేశాం. ఓ రోజు రణ్‌వీర్‌ షూటింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ చేసి దువా అని చెప్పా. దానికి ఒకే అన్నాడు. అదే పేరు పెట్టాం. దువా అంటే అరబిక్‌ భాషలో ప్రార్థన అని అర్థం. మా ప్రార్థనలకు సమాధానమే ఈ పాప అనే అర్థం వచ్చేలా ఈ పేరు సెలక్ట్‌ చేసుకున్నాం. అదే పేరు ప్రకటించాం” అని వివరించింది

Exit mobile version
Skip to toolbar