Complaint Filed Against Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌పై వివాదంలో చిక్కుకున్నారు. విజయ్ ముస్లింలను అవమానించారంటూ తమిళనాడు సున్నత్ జమాత్.. చెన్నై పోలీసులకు కంప్లైంట్ అందింది. దీనికి విజయ్ ఇచ్చిన ఇఫ్తార్ విందు కారణమని తెలుస్తోంది. గత శుక్రవారం విజయ్ రాయపేట వైఎంసీ గ్రౌండులో ముస్లింల కోసం ఇఫ్తార్ విందును ఏర్ఆపటు చేశారు. రంజాన్ ఉపవాస దీక్ష విరమించే ముందు ప్రార్థనల్లో పాల్గొని.. ఆ తర్వాత వారితో కలిసి విందు కూడా చేశారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు అవే విజయ్‌ని వివాదంలో పడేలా చేసింది. దీనిపై తమిళనాడు సున్నత్ జమాత్ అభ్యంతర వ్యక్తం చేసింది. ముస్లింల పవిత్ర మాసంలో ఎంతో పవిత్రంగా భావించే ఉపవాస దీక్షలు, ఇఫ్తార్ విందులో సంబంధం లేని వ్యక్తులు పాల్గొన్నారని, తాగుబోతులు, రౌడీలు పాల్గొనడం ముస్లింలను అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇఫ్తార్ విందు ఏర్పాట్లు సక్రమంగా చేయలేదని, విజయ్ తెచ్చిన విదేశీ గార్డులు ప్రజలను అగౌరవపరిచారని తమిళనాడు సున్నత్ జమాత్ కోశాధికారి సయ్యద్ కౌస్ మీడియాతో పేర్కొన్నారు. ఈ మేరకు విజయ్‌పై చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.