Prime9

Rahul Ramakrishna: దర్శకుడిగా మారనున్న స్టార్‌ కమెడియన్‌!

Comedian Rahul Ramakrishna Turns as Director: కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కమెడియన్‌గా తనదైన కామెడీతో ఆడియన్స్‌ని అలరిస్తు వస్తున్నాడు. అతడి కామెడీకి ప్రత్యేకమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇప్పటి వరకు హాస్య నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి రాహుల్‌ రామకృష్ణ.. ఇప్పుడు మెగాఫోన్‌ పట్టబోతున్నాడు. ఆయన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. అడ్వెంచర్‌ మూవీగా ఈ సినిమా తీయబోతున్నాడట. ఈ విషయాన్ని అతడే స్వయంగా ప్రకటించాడు.

 

ఈ సినిమాల్లో నటించే నటీనటుల కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నాడు. ఆసక్తి ఉన్న వాళ్లు రెస్యూమే, పోర్ట్‌ఫోలియోలు పంపించాలని తెలిపాడు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశాడు. ఆడిషన్‌ కాల్‌కు నటీనటులను ఆహ్వానిస్తూ ప్రకటన ఇచ్చాడు. “త్వరలోనే ఓ అడ్వెంచర్‌ మూవీని తెరకెక్కించబోతున్నాను. ఆసక్తి ఉన్నవాళ్లు కింద ఇచ్చి మెయిల్‌ ఐడీకి మీ యాక్షన్‌ పోర్ట్‌ఫోలియో/రెస్యుమే/షోరీల్స్‌ పంపించగలరు. కింద ఇచ్చిన పోస్టర్‌లో మెయిల్‌ ఐడీ ఉంది. 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఫీమెల్‌ యాక్టర్స్‌ కావలెను” అని తన పోస్ట్‌లో వెల్లడించాడు.

 

కాగా సైన్మా అనే షార్ట్‌ ఫిలింతో నటుడిగా తన కెరీర్‌ మొదలు పట్టాడు రాహుల్‌ రామకృష్ణ. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ షార్ట్‌ ఫిలింతోనే అతడి కెరీర్‌ ప్రారంభమైంది. జయమ్ము నిశ్చయమ్మురా అనే మూవీతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో హీరో ఫ్రెండ్‌ పాత్రలో తనదైన కామెడీతో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు సంభాషణల రచయితగానూ పని చేశాడు. ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. అర్జున్‌ రెడ్డి చిత్రంతో ఓవర్‌ నైట్ స్టార్‌ అయిపోయాడు. ఇందులో డాక్టర్‌ శివ పాత్రలో హీరో స్నేహితుడిగా అతడి పాత్రంకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా తర్వాత అతడు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా ఆఫర్స్‌, బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో దూసుకుపోయాడు. అతి తక్కువ టైంలోనే అర్జున్‌ రెడ్డి, జాతి రత్నాలు, బ్రోచేవారెవరురా, ఆర్‌ఆర్‌ఆర్‌, ఓం భీం బుష్‌ వంటి హిట్‌ చిత్రాల్లో నటించాడు.

 

 

Exit mobile version
Skip to toolbar