Theaters: దేశంలో మరికొన్ని సినిమా థియేటర్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు పలు గ్రామీణ ప్రాంతాల్లో థియేటర్లని నిర్మించేందుకు ప్రభుత్వ రంగ సీఎస్‌సీ ఈ- గవర్నెన్స్ సర్వీసెస్ నిర్ణయించింది. అక్టోబర్ సినిమాతో కలిసి 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో మరో 10,000 సినిమా హాళ్లను ప్రారంభించనున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో సీఎస్సీ తెలిపింది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సీఎస్‌సీ, అక్టోబర్ సినిమాస్ మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరినట్లు వెల్లడించింది.
ఇక ఈ ఒప్పందంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 100-200 సీటింగ్ కెపాసిటీ ఉన్న 1 లక్ష చిన్న సినిమా థియేటర్లు రానున్నాయి. భారతదేశంలో వినోద రంగం అభివృద్ధి చెందుతోంది. గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలలో ఈ రంగం అభివృద్ధికి ఈ హాళ్లు ఎంతగానో సహాయపడతాయని సీఎస్‌సీ వెల్లడించింది. ఈ థియేటర్ల ఒప్పందం వల్ల మా సేవలను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి తెస్తుందని వినోద రంగ అభివృద్ధికి తోడ్పడుతుంది’ అని సీఎస్‌సీ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ రాకేశ్ అన్నారు.
ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న యశోద.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?