Bommarillu Bhaskar: ఒక సినిమా మొదలయ్యింది అంటే.. అందులో ఎంతోమంది టెక్నీషియన్స్, ఇంకెంతోమంది నటీనటులు ఉంటారు. కొన్నిసార్లు ఒకరి అభిప్రాయాలూ ఇంకొకరికి నచ్చవు. అందుకే ఎక్కువగా హీరోకి, డైరెక్టర్ కి పడలేదు. కథ విషయంలో గొడవలు.. ఇలా రకరకాల వార్తలు వింటూనే ఉంటాం. తాజాగా జాక్ మూవీ టీమ్ లో కూడా ఇలాంటి గొడవలే తలెత్తాయి.
సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జాక్. బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి,. నేడు ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
అయితే గత కొన్నిరోజులుగా డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కు, సిద్దు జొన్నలగడ్డకు మధ్య గొడవ జరుగుతుందని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరికి పొసగడం లేదని, సినిమాలో ఒక సాంగ్ ను డైరెక్టర్ లేకుండా సిద్ధునే డైరెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా వీరి మధ్య ఉన్న విభేదాలు వలనే జాక్ రిలీజ్ లేట్ అవుతూ వచ్చిందని కూడా పుకార్లు వినిపించాయి.
తాజాగా ఈ పుకార్లకు బొమ్మరిల్లు భాస్కర్ చెక్ పెట్టాడు. జాక్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ.. ” సినిమా అనేది టీమ్ వర్క్. అందరూ ఎంతో కష్టపడి చేస్తేనే సినిమా బయటకు వస్తుంది. అందరూ డిస్కషన్ రూమ్ లోకి అడుగుపెట్టమంటే అదొక యుద్ధ భూమి. అక్కడ చాలా చర్చలు జరుగుతాయి. సినిమా కోసం మేము వాదించుకుంటాం.. తిట్టుకుంటాం… కొట్టుకొనేవరకు వెళ్తాము. బయటకు వచ్చాకా అవేమి గుర్తుండవు.
సిద్దుకు సినిమాపై మంచి అవగాహన ఉంది. అది సినిమాకు బలాన్నిపెంచుతుంది. కొన్ని సీన్స్ సిద్ధుకు అప్పజెప్పి చాలా నిశ్చింతగా ఉండొచ్చు. అంటే.. సీన్ కు రోలింగ్, కట్ చేప్తే చాలు. మిగతాది అంతా అతను చూసుకుంటాడు” అని చెప్పుకొచ్చాడు. సిద్దు సైతం.. భాస్కర్ ఎడిటింగ్ చేస్తున్న సమయంలో తానే ఒక సాంగ్ కు డైరెక్ట్ చేసినట్లు కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఇక్కడితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందనే అనుకుంటున్నారు నెటిజన్స్. మరి ఈ సినిమాతో సిద్దు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.