Prime9

Bandla Ganesh: బండ్ల గణేష్‌ మరో షాకింగ్‌ ట్వీట్‌ – అతి అభిమానుం, అతి ప్రేమ ప్రమాదకరం..

Bandla Ganesh Again Shared a Shocking Tweet: నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ మళ్లీ యాక్టివ్‌ అయ్యారు. మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న ఆయన వరుస ట్వీట్స్‌ చేస్తున్నారు. రీసెంట్‌గా థియేటర్ల వివాదంపై పరోక్షంగా స్పందించారు. అందరు కమల్‌ హాసన్‌లో.. నటనలో అదరగొడుతున్నారంటూ సటైరికల్‌ ట్వీట్‌ చేసి హాట్‌ టాపిక్‌ అయ్యారు.

 

అది కూడా నిర్మాత దిల్‌ రాజు ప్రెస్‌ మీట్‌ జరుగుతున్న సమయంలోనే ఈ ట్వీట్‌ చేయడం చర్చనీయాంశమైంది. ఆయన ఎవరిని ఉద్దేశించి ఇది చేశారనేది మాత్రం క్లారిటీ లేదు. తాజాగా బండ్ల గణేష్‌ మరో షాకింగ్‌ పోస్ట్‌ చేశారు. ‘అతి ప్రేమ, అతి నమ్మకం.. అతి అభిమానం.. అతి విశ్వాసం.. ఆరోగ్యానికి హానికరం’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. దీంతో ఈ ట్వీట్‌ ఆయన ఎవరిని ఉద్దేశించి చేశారనేది హాట్‌ టాపిక్‌గా మారింది.

 

అయితే ఇది కేవలం తన లైఫ్‌ కోటేషన్‌ అనిపిస్తోంది. నిజ జీవితంలో ఆయనకు ఎదురైన అనుభవాలను ఉద్దేశించిన ఈ పోస్ట్‌ చేసినట్టు తెలుస్తోంది. మరి ఇది చేయడానికి కారణం ఎవరనేది మాత్రం క్లారిటీ లేదు. కాగా ఇటీవల బండ్ల గణేష్‌ సీనియర్‌ నటులు కోట శ్రీనివాస్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఆయనను పరామర్శించిన అనంతరం దిగిన ఫోటోను సేర్‌ చేశారు. ఇందులో కోట శ్రీనివాస్‌లో వృద్ధాప్య ఛాయలు బాగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు అర్థమైపోతుంది. ఇందులో ఆయన గుర్తు పట్టేలేని విధంగా మారిపోయారు.

Exit mobile version
Skip to toolbar