Site icon Prime9

Balakrishna: కొత్త అవతారంలో బాలయ్య.. ‘డాకు మహారాజ్‌’ టీజర్‌ రిలీజ్

Balakrishna Daku Maharaj Teaser: టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి మేకర్స్ ‘డాకు మహారాజ్‌’ అనే టైటిల్‌ అనౌన్స్‌ చేశారు. ఈ సినిమా డైరెక్టర్ బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా, మేకర్స్ టైటిల్ ప్రకటిస్తూ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

టీజర్‌ను చూస్తే..  ‘ఈ కథ వెలుగుని పంచే దేవుళ్లది కాదు. చీకటిని శాసించే రాక్షసులది కాదు. ఆ రాక్షసులను ఆడించే రావణుడిదీ కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది’ అనే లైన్‌తో టీజర్‌ ప్రారంభమైంది. అయితే ఈ వాయిస్ పూర్తయిన తర్వాత వెంటనే బాలకృష్ణ డైలాగ్ వచ్చింది. గుర్తుపట్టావా.. మహారాజ్.. డాకు మహారాజ్ అని గంభీరంగా చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.  ఈ టీజర్ 96 సెకన్లు ఉండగా.. ఇందులో ఓ బ్లాక్ గుర్రంపై బాలకృష్ణ వస్తున్న తీరుకు డైరెక్టర్ బాబీ ఇచ్చిన ఎలివేషన్ అదిరిపోయాయి.

ఈ సినిమాలో చౌందిని చౌదరి, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, బాబీ డియోల్ తదితరులు నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో బాబీ దేవోల్, ఊర్వశీ రౌతెలా కీలక పాత్రల్లో కనిపించనుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ 1980లో కథతో ఫుల్ యాక్షన్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ‘భగవంత్‌ కేసరి’ తర్వాత బాలకృష్ణ నటించిన మూవీ కావడంతో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Exit mobile version