Another Police Case on Actress Kalpika Ganesh: హైదరాబాద్‌లోని ప్రముఖ పబ్‌లో నటి కల్పిక గణేష్ నానా హంగామా చేసింది. పబ్ నిర్వాహకులపై దాడి చేసి వారిపై వాగ్వాదానికి దిగింది. పైగా వారే తనపై దాడి చేశారంటూ ఆరోపణలు చేసింది. ఇందులో అసలు విషయం బయటపడటంతో నటి కల్పిక గణేష్‌పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఆమెపై మరో కేసు నమోదైంది.
కల్పిన తనని వేధిస్తోందని, అసభ్య పదజాలతో దూషిస్తుందంటూ ఓ యువతి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఆన్‌లైన్‌లో వేదికగా కల్పిక తనని వేధిస్తుందని కీర్తన ఆనే యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా ఆమె పోలీసులకు ఇచ్చింది. దీంతో కల్పికపై సైబర్ క్రైం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా కల్పిక గణేష్ తెలుగు స్టార్ హీరో చిత్రాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘జులాయి’, ‘పడి పడి లేచే మనసు’, ‘యశోద’.. వంటి సినిమాల్లో సహాయక నటి పాత్రలు చేసింది. తెలుగులోనే కాదు తమిళ, మలయాళ భాషలోను పలు సినిమాలు చేసింది. అయితే గత కొంతకాలంగా ఆమె సినిమాల్లో కనిపించడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే తరచూ పలు వివాదాలతో ఆమె వార్తల్లో నిలిచింది. గతంతో నటి ధన్య బాలకృష్ణతో వివాదం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. గతనెల తన బర్త్‌డే సందర్భంగా ఓ పబ్‌కి వెళ్లి సిబ్బందితో గొడవ పడింది. కేక్ విషయంలో నానా రచ్చ చేసింది. ఈ వ్యవహారం కాస్తా పోలీసుల వరకు వెళ్లడంతో ఆమెపై కేసు నమోదైంది.