Site icon Prime9

Amitabh Bachchan Buy Land: అయోధ్యలో మళ్లీ భూమి కొన్న అమితాబ్‌ – ఈసారి భారీ మొత్తంలో..!

Amitabh Bachchan Buy Land Again in Ayodhya: బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్ అయోధ్యలో మళ్లీ భూమి కొనుగోలు చేశారు. ఈ సారి భారీగా అక్కడ భూమి కోనుగోలు చేశారు. ఓ మంచి కార్యక్రమం కోసం ఆయన ఈ ల్యాండ్‌ తీసుకున్నట్టు బి-టౌన్‌లో ప్రచారం జరుగుతుంది. గతంలో ఇంటి కోసం ఆయన సుమారు రూ. 5 కోట్లు పెట్టి భూమి కొన్నారు. అయితే ఈసారి స్వచ్ఛంద సేవ కార్యక్రమంలో కోసం సుమారు 54,454 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న భూమిని ఎంపిక చేసుకున్నారట.

రామ మందిరానికి 10 కిమి దూరం

ఇది రామ మందిరానికి 10 కిలోమిటర్ల దూరంలో ఉంటుందని తెలుస్తోంది. ఇది ఆయన పెట్టబోయే హరివంశ రాయ్‌ బచ్చన్‌ ట్రస్ట్‌ కోసం తీసుకున్నట్టు సన్నిహితవర్గాలు అంటున్నాయి. ఆయన తండ్రి హరివంశ్‌ రాయ్‌ గౌరవార్థం అయోధ్యలో ఆయన పేరుతో ఓ ట్రస్ట్‌ పెట్టాలనుకుంటున్నారు. దీని ఆయన అక్కడ ఆయన స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నట్టు సన్నిహితవర్గాల నుంచి సమాచారం. ఇది ఫైనల్‌ కూడా అయ్యిందని, ఇక రిజిస్ట్రేషన్‌ మాత్రమే మిగిలి ఉన్నట్టు వినిపిస్తోంది.

ఇప్పటికే హవేలిలో ప్లాట్

కాగా ఇప్పటికే అమితాబ్‌ అయోధ్యలో భూమి కొన్న విషయం తెలిసిందే. గతేడాది అయోధ్య రామమందిరం నిర్మాణం జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ బాల రాముని ప్రతిష్టించడానికి ముందు అయోధ్యలోని హవేలి అవధ్‌లో ప్లాట్‌ కొన్నారు. ఆయనతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా అక్కడ భూమిని కోనుగోలు చేశారు. హవేలి అవధ్‌ ప్లాట్‌ కోసం బిగ్‌బి రూ. 4.54 కోట్లు వెచ్చించారు.

ఈ ప్లాట్ అయోధ్య రామమందిరానికి 10 నిమిషాల ప్రయాణ దూరంలో ఉంటుంది. అలాగే అయోధ్య అంతర్జాతీయ వినానాశ్రయానికి 20 నిమిషాల దూరంలో ఉంటుందట. ఇప్పుడు స్వచ్ఛంద కార్యక్రమంలో ఆయన భారీ మొత్తంలో ల్యాండ్‌ కోనుగోలు చేయడం విశేషం. ఇక అమితాబ్ సినిమాల విషయానికి వస్తే.. చివరిగా ఆయన కల్కి 2898 ఏడీలో నటించారు. ఇందులో అశ్వద్ధామ పాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్, సాయి పల్లవిల ‘రామయణ’ సినిమాలో నటిస్తున్నారు.  ప్రస్తుతం ఈ మైథలాజిక్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

Exit mobile version
Skip to toolbar