Amitabh Bachchan Shuts Down Troll Who Ask About Sleep: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు సోషల్ మీడియాలో ఛేదు అనుభవం ఎదురైంది. ఆయన పెట్టిన ఓ పోస్ట్ నెటజన్ షాకింగ్ రిప్లై ఇచ్చాడు. అతడి రిప్లై బిగ్‌బి సైతం స్పందించి సైలెంట్ కౌంటరిచ్చారు. కాగా అమితాబ్ ఎంత బిజీగా ఉన్న తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటారానే విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహించిన ఫ్యాన్స్‌కి సలహాలు, సూచనలు ఇస్తుంటారు.
ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు, సలహాలు ఇస్తుంటారు. అలాగే ఏదైన అంశంపై తన అభిప్రాయన్ని పంచుకుంటారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఎక్స్ వేదిగా లైవ్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగి ప్రశ్నలకు ఒపికగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యంపై ఫ్యాన్స్‌కి ఆయన ఓ సూచన చేశారు. “మీ గ్యాడ్జెట్స్‌ని బ్రేక్ చేయండి.. దీర్ఘాయుస్సు పొందండి” అని పోస్ట్ పెట్టారు. దీనికి ఓ నెటిజన్ షాకింగ్ రిప్లై ఇచ్చాడు.
‘మీరు సమయానికి పడుకోవడానికి ప్రయత్నించండి.. లేకపోతే ఎక్కువ కాలం జీవించలేరు’ కామెంట్ చేశాడు. దీనిపై అమితాబ్ స్పందిస్తూ సదరు నెటిజన్‌కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ‘నా మరణం గురించి మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు. కానీ అదంత మన చేతుల్లో లేదు. అంత ఆ ఈశ్వరుడి దయ” అంటూ రెండు చేతులు జోడించి ఉన్న ఎమోజీని జత చేశారు. ప్రస్తుతం ఆయన రిప్లై సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. ‘బిగ్‌బి సూపర్ రిప్లై’, ‘బిగ్‌బి రాక్.. ఫ్యాన్ షాక్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే.. గతేడాది కల్కి 2898 ఏడీ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం కల్కి 2 మూవీతో బిజీగా ఉన్నారు. మరోవైపు హిందీలో పలు సినిమాలు చేస్తున్నారు. అలాగే ఆయన హోస్ట్‌గా చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి నెక్ట్స్ సీజన్‌కి హోస్ట్ చేసేందుకు కూడా ఆయన రెడీ అవుతున్నారు.
समय से सो जाया करो, वरना लंबी उम्र भी नहीं टिकेगी।
— raman (@ramanLohara) June 8, 2025