Site icon Prime9

Salman Khan: హత్య బెదిరింపులు – బిగ్‌బాస్‌ షోలో సల్మాన్‌ ఖాన్‌ షాకింగ్‌ కామెంట్స్‌, వీడియో వైరల్‌

Salman Khan Shocking Comments

Salman Khan Shocking Comments at Bigg Boss Show: బాలీవుడ్‌ బాయ్‌జాన్‌ సల్మాన్‌ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి వరుస బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు ముంబై ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది. అంతేకాదు తన భద్రత కోసం సల్మాన్‌ బుల్లెట్‌ ఫ్రూవ్‌ కారును కూడా కొనుగోలు చేశాడు. ఇటీవల కట్టుదిట్టమైన భద్రత మధ్య సల్మాన్‌ బిగ్‌బాస్‌ షోకు హాజరయ్యారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అయ్యింది. ఇందులో సల్మాన్‌ చాలా డల్‌గా కనిపించారు. మునుపటి జోష్‌ ఆయనలో కనిపించలేదు.

కారణం ఆయన స్నేహితుడు, ఎన్సీపీ లీడర్‌ బాబా సిద్ధిఖీ హత్యా గురికావడం, ఆ తర్వాత ఆయన వరుస బెదిరింపులు వస్తుండటంతో ఆయన ఆందోళనలో కనిపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సల్మాన్‌ బిగ్‌బాస్‌ షోకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్‌లో ఆయన కంటెస్టెంట్స్‌తో కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా డల్‌గా కనిపించిన ఆయన హౌజ్‌లో కంటెస్టెంట్స్‌ తప్పులు, గొడవలపై స్పందిస్తూ ఇలా అన్నారు. హౌజ్‌లో ఇంటి సభ్యులు తీరు, ఒకరిపై ఒకరు చేసుకుంటున్న రపణల నేపథ్యంలో సల్మాన్‌ అసహనానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “హౌజ్‌లో ఇంటి సభ్యులు ఎలాంటి సభ్యులు ఎలాంటి ఫీలింగ్స్‌ చూపించిన వాటిని పట్టించుకోవద్దు.

నిజానికి ఈ రోజు నేను ఇక్కడకు రావద్దని అనుకున్నా. అసలు ఎవరితో కలవద్దని, మిమ్మల్ని కూడా కలవద్దని అనుకున్నా. కానీ ఇది నా వృత్తి కాబట్టి ఇక్కడకు రావాల్సి వచ్చాను. పని పట్ల నాకు ఉన్న నిబద్దతే నన్ను ఇక్కడకు రప్పించింది” అంటూ ఊహించని కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం సల్మాన్‌ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా కృష్ణ జింక వేటాడిన కేసులో సల్మాన్‌ నిందితుడుగా తేలిన సంగతి తెలిసందే. అప్పటి నుంచి ఆయనకు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ బృందం నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హ్యత్యానంతరం ఇవి మరి ఎక్కువ అయ్యాయి. ఇటీవల లారెన్స్‌ బిష్ణోయ్‌ మనుషులు సల్మాన్ ఖాన్‌ ఇంటి ముందు రెక్కి నిర్వహించి సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.

Exit mobile version