Prime9

Ali on Rajendra Prasad Comments: రాజేంద్ర ప్రసాద్‌ వ్యాఖ్యలపై అలీ రియాక్షన్‌

Ali Reacts on Rajendra Prasad: సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. డైరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్‌డే కార్యక్రమంలో మాట్లాడుతూ నటుడు అలీపై మాట తులాడు. ఆలీని అనరాని మాట్లా అన్నాడు. లం*** కొడుకు అంటూ అనుచితంగా మాట్లాడాడు. ఆయన మాటలకు అంతా షాక్‌ అయ్యారు. కానీ ఎవరూ ఏం మాట్లాడలేదు. చివరికి అలీ సైతం మౌనంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన అనుభవం ఉన్న నటుడు.

 

కెరీర్‌లో ఆయన వివాదాలకు దూరంగా ఉంటూ మంచి నటుడిగా గుర్తింపు పొందారు. తెలుగు సినీ పరిశ్రమలో నట కిరీటి అనే బిరుదు కూడా పొందారు. అలాంటి గొప్ప నటుడు, వయసులో ఎంతో అనుభవం ఉన్న ఆయన ఇలా తోటి నటులపై నోరు జారడం వివాదస్పదంగా మారింది. కానీ నెటిజన్స్‌, వారి ఫ్యాన్స్‌ మాత్రం రాజేంద్ర ప్రసాద్‌పై మండిపడుతున్నారు. వయసులో, నటనలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఇలాంటి చీప్‌ కామెంట్స్‌ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

అయితే రాజేంద్రప్రసాద్‌ వ్యాఖ్యలపై తాజాగా నటుడు అలీ స్పందించారు. ఈ మేరకు ఆయన వీడియో రిలీజ్‌ చేశారు. “అందరికి నమస్కారం. నిన్న ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్‌డే సందర్బంగా ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్‌ గారికి అనుకోకుండ మాట తూలింది. కానీ, మీడియా మిత్రులు దానిని వైరల్‌ చేస్తున్నారు. ఆయనొక మంచి నటుడు, గొప్ప ఆర్టిస్టు. కొద్ది రోజుల క్రితం తనకు అమ్మలాంటి కూతురు మరణం వల్ల పుట్టెడు దు:ఖంలో ఉన్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ఆయన పెద్దాయన, కావాలని అనలేదు” అంటూ అలీ చెప్పుకొచ్చారు.

 

కాగా రాజేంద్ర ప్రసాద్‌ తన కామెంట్స్ పట్ల అలీకి క్షమాపణలు చెబుతారని అంతా అనుకున్నారు. కానీ, రాజేంద్ర ప్రసాద్‌ మాత్రం తన కామెంట్స్‌ని సమర్థించుకున్నారు. ఆయనకు వస్తున్న నెగిటివిటీ నేపథ్యంలో ఆయన స్పందించారు. “నిన్న నేను మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకుంటే అది మీ ఖర్మ. దానికి ఎవరూ ఏం చేయలేం. నేను ఇలాగే ఉంటాను. అలాగే మాట్లాడతాను. నేనైతే ఇలాగే సరదాగా ఉంటాను” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్‌పై నెటిజన్స్‌ రకరకాలుగా స్పందిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar