Prime9

Akkada Ammayi Ikkada Abbayi: ఓటీటీలోకి యాంకర్ ప్రదీప్ సినిమా.. ఎప్పుడు వస్తుందో తెలుసా..?

Akkada Ammayi Ikkada Abbayi: బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు.. యాంకర్ గా కాకుండా హీరోగా కూడా బిజీగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న ప్రదీప్.. మధ్యలో గ్యాప్ తీసుకొని షోస్ చేస్తూ వచ్చాడు. ఇక ఈ మధ్యనే ప్రదీప్ తన రెండో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అదే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.

 

జబర్దస్త్, ఢీ షోలకు దర్శకత్వం వహించిన నితిన్, భరత్ లు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా మరో లేడీ యాంకర్ దీపికా పిల్లి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎన్నో అంచనాలతో ఈ సినిమా ఏప్రిల్ 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 

వినోదాత్మకంగా కథ సాగినా… కథ, కథనం మొత్తం రొటీన్ గా సాగింది. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించలేకపోయారు. ఇక ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీ బాట పట్టింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ఈటీవీ విన్ కొనుగోలు చేసింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

 

మే 8 నుంచి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరి థియేటర్ లో విజయాన్ని అందుకోలేకపోయినా ఈ సినిమా ఓటీటీలో అయినా విజయం అందుకుంటుందేమో చూడాలి.

Exit mobile version
Skip to toolbar