Site icon Prime9

Agent OTT: ఎట్టేకలకు అయ్యగారి సినిమాకు మోక్షం.. ఏజెంట్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Agent OTT: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. త్వరలోనే రాబోతుంది అని అఖిల్ ఫ్యాన్స్ పాటలు పాడుకొనే సమయం వచ్చేసింది. అక్కినేని నట వారసుడిగా అక్కినేని అఖిల్.. అఖిల్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాఆశించినంత  ఫలితం అందివ్వలేదు. దీంతో రెండోసారి కూడా నాగార్జున.. కొడుకును లాంచ్ చేశాడు. అఖిల్ తరువాత హలో అంటూ అందరికీ హ్యాండే ఇచ్చాడు. హలో సినిమా కూడా  విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తరువాత మిస్టర్ మజ్ను అంటూ రీ రీ లాంచ్ చేశారు. అది కూడా అఖిల్ కు విజయాన్ని అందివ్వలేకపోయింది.

ఇక దాదాపు రెండేళ్ల కష్టంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటూ అయ్యగారు ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన విజయంతో  అయ్యగారి కెరీర్ మారిపోతుంది అనుకున్నారు. కానీ, ఆయన మళ్లీ వెనక్కి వెళ్ళిపోయాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో ఎంత క్లాస్ లుక్ లో కనిపించాడో.. ఆ తరువాత వచ్చిన ఏజెంట్ సినిమాలో అంత మాస్ లుక్ లో దర్శనమిచ్చాడు.

కిక్, ధృవ, రేసుగుర్రం లాంటి హిట్స్ అందించిన సురేందర్ రెడ్డి.. అఖిల్ కు  కూడా మంచి హిట్ ఇస్తాడు అనుకొని నాగ్.. అఖిల్ ను అప్పగించాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమానే ఏజెంట్. రెండేళ్లు కష్టపడి ఈ సినిమాకోసం అఖిల్ బాడీ పెంచాడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంతోనే సాక్షి వైద్య అనే కొత్త అమ్మాయి తెలుగుకు పరిచయమైంది.

Vijay Devarakonda: రౌడీ జనార్దన్ గా విజయ్ దేవరకొండ.. వర్క్ అవుట్ అవుతుందా.. ?

ఏజెంట్ పోస్టర్స్, ట్రైలర్ చూసి అమ్మ బాబోయ్ అయ్యగారి లుక్.. బాడీ ఏంటి ఈ ర్నేజ్ లో ఉంది. సురేందర్ రెడ్డి.. అఖిల్ ను నెక్స్ట్ లెవెల్ లో చూపించి ఉంటాడు అనుకోని ఎన్నో అంచనాలతో  2023 ఏప్రిల్‌ 28న థియేటర్‌ కు వెళ్లినప్రేక్షకులు  ఊసురుమంటూ బయటకు వచ్చారు. కథ, కథనం ఏంటో కూడా అర్థంకాలేదని చెప్పినవారు కొంతమంది అయితే.. అసలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సరిగ్గా చేయలేదని, డైలాగ్స్ వినిపించడం లేదని ఇంకొందరు చెప్పారు.

సరే ఏజెంట్ సినిమా థియేటర్ లో కాకపోతే ఓటీటీకి వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటే.. ఇప్పటివరకు అదుగో వస్తుంది.. ఇదుగో వస్తుంది అనడమే తప్ప ఓటీటీలో రిలీజ్ చేసింది లేదు. నిర్మాతల గొడవ వలన ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ వాయిదా పడుతూ వచ్చింది. సోనీ లివ్.. ఏజెంట్ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. దాదాపు 2 ఏళ్ళ తరువాత ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది.

తాజాగా సోనీ లివ్.. ఏజెంట్ స్ట్రీమింగ్ డేట్ ను అధికారికంగా ప్రకటించింది. మార్చి 14 నుంచి ఏజెంట్ సోనీ లివ్ లో అందుబాటులో ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అక్కినేని అభిమానులు.. అయ్యగారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హమ్మయ్య ఇప్పటికైనా వస్తుంది. అసలు అయ్యగారి సినిమా ఓటీటీలో చూడలేము అని అనుకున్నామని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version
Skip to toolbar