Prime9

Aishwarya Rai: భగవద్గీత శ్లోకంతో కేన్స్ లో మెరిసిన ఐశ్వర్యరాయ్

కేన్స్ 2025 ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. ఇందులో ఐశ్వర్యరాయ్ ఐకాన్ గా నిలిచింది. మొన్న జరిగిన కార్యక్రమంలో సింధూర్ తో కనిపించగా, ఈ రోజు భగవద్గీత లోని స్లోకాన్ని తన దుపట్టాలో భాగం చేసుకుంది. ఇది బనారస్ లో చేతితో తయారు చేసినదిగా ఆవిడ డిజైనర్ గౌరవ్ గుప్తా తెలిపారు. దీంతో ప్రపంచానికి బలమైన స్టేస్మెంట్ ఇచ్చారు. సింధూర్ ధరించడం వలన భారత్ ఉగ్రవాదులకు తగిన బుద్ది చెప్పిందని చెప్పకనే చెప్పారు. ఇక భగవద్గీత స్లోకంతో భారతీయ మూలాలను నొక్కి వక్కానించినట్లయింది.

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన । మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోయస్త్వకర్మణి

దీని అర్థం ఏంటంటే… నీకు పనిచేయడం మీదే అధికారం ఉంది. ఫలితం మీద కాదు.

 

ఈ సారి జరుగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఐశ్వర్యరార్ నల్లని గౌనులో కనిపించింది. దానిపై ఒక పెద్దటి శాల్ వేసుకుంది. ఇది వారణాసిలో చేతితో తయారు చేసినది దీనిపై భగవద్గీత స్లోకం ఉంది. నక్షత్రాలతో కూడిన ఆవిడ గౌనును ఎంచుకుంది. కేన్స్ డ్రెస్ కోడ్ ను తూచా తప్పకుండా పాటించింది ఐశ్వర్యరాయ్.

 

 

కేన్స్ రెడ్ కార్పెట్ పై ఐశ్వరాయ్ బచ్చన్ గౌనులో కెమెరాలకు ఫోజులిచ్చారు. వెండి, బంగారం, నలుపు రంగులలో గౌనును డిజైన్ చేసింది గుప్తా. దీనిపై మైక్రో గ్లాస్ స్పటికాలతో నక్షత్రాలు అలంకరించబడ్డాయి. వారణాసిలో చేతితో నేసిన దుపట్టాపై భతవద్గీత నుండి స్లోకాన్ని తీసుకుని పొందుపరిచినట్లు డిజైనర్ గౌరవ్ గుప్తా తన ఇన్ స్టా గ్రామ్ లో వెళ్లడించారు.

 

aishwarya rai wear sanskrit sloka in cannes 2025

aishwarya rai wear sanskrit sloka in cannes 2025

 

ఇక ఆభరణాల విషయానికి వస్తే తన సంతకంలోని వి ఉంగరం, చెవిపోగులు, నెక్లెస్ ను వేసుకున్నారు. తన అసాధారమైన అందంతో కేన్స్ కు అందాలు అందింది ఐష్. కేన్స్ ఫెస్టివల్ కోసం ఐశ్వర్యరాయ్ బచ్చన్ కు కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం గుప్తాకు ఇది మొదటిసారికాదు. 2022లో కూడా అతనే డిజైన్ చేశారు.

 

 

ఐశ్వర్య తొలిసారి 2025లో రెడ్ కార్పెట్ పై నుదుటన సింధూరాన్ని ధరించి కనిపించింది. ఇది భారత్ దేశం ఉగ్రవాదంపై జరిపిన పోరాటానికి నివాలుగా చెప్పబడుతుంది. ఇక భగవద్గీత శ్లోకం దేశపు మూలాలను సూచిస్తుంది.

 

 

Exit mobile version
Skip to toolbar