Site icon Prime9

Suhasini Maniratnam: ఆ విషయం చెబితే పరువు పోతుందని భయపడ్డాను – స్టార్‌ నటి సుహాసిని షాకింగ్‌ కామెంట్స్‌

Suhasini Maniratnam Open Up on Her TB Disease:అలనాటి తార, సీనియర్‌ నటి తన గురించిన ఓ సంచలన విషయం బయటపెట్టింది. ఇటీవల తాను ఓ వ్యాధి బారిన పడ్డానని, బయటికి చెబితే పరువు పొందుతుందని చెప్పలేదంటూ షాకింగ్ కామెంట్స్‌ చేసింది. కాగా నటి సుహాసిని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం తల్లి, అతిథి పాత్రలు చేస్తున్న ఆమె ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌ అనే విషయం తెలిసిందే. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు, సూపర్‌ స్టార్‌ కృష్ణ,మొరళి మోహన్‌, మెగాస్టార్‌ చిరంజీవి వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు పొందారు.

నటిగా, నిర్మాతగా

హీరోయిన్‌గా కొనసాగుతున్న క్రమంలో స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నంను పెళ్లి చేసుకుని సెటిలైపోయారు. పెళ్లి తర్వాత కూడా నటిగా తన కెరీర్‌ కొనసాగిస్తున్న సుహాసిని ప్రస్తుతం తల్లి పాత్రలు పోషిస్తున్నారు. అలాగే తన భర్త మణిరత్నంతో కలిసి సినిమాలు నిర్మిస్తూ కెరీర్‌ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల ఆమె ఓ ఇంటర్య్వూలో పాల్గొంది. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఆమె మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ షాకింగ్‌ విషయం చెప్పి ఫ్యాన్స్‌ని ఆందోళనకు గురి చేశారామె.

పరువుపోతుందని భయపడ్డాను

ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. తాను ఇటీవల ఓ భయంకరమైన వ్యాధి బారిన పడ్డానన్నారు. ఆరు నెలల చికిత్స అనంతరం ఆ వ్యాధి నుంచి బయటపడ్డానంటూ బాంబు పేల్చారు. “నాకు టీబీ వ్యాధి ఉంది. ఈ విషయం బయటకు చెప్పితే పరువు పోతుందని బయపడ్డాను. అప్పుడు ఎవ్వరికి చెప్పుకుండ సీక్రెట్‌గా చికిత్స తీసుకున్నాను. ఈ జబ్బుకి ఆరు నెలల పాటు చికిత్స తీసుకున్నా. కొన్నాళ్ల తర్వాత దీని గురించి బయటపెట్టి అందరికి టీబీపై అవగాహన కల్పించాలని అనుకున్నాను” అని చెప్పుకొచ్చింది. ఇది వీని ఆమె ఫ్యాన్స్‌ అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఆరేళ్ల వయసు నుంచే ఈ వ్యాధి 

ఆ తర్వాత తనకు ఈవ్యాధి ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడే బయటపడిందని చెప్పారు. “నాకు టీబీ ఆరేళ్ల వయసులోనే బయటపడింది. మళ్లీ 36 ఏళ్ల వయసులో టీబీ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. తర్వాత నాకు ఉన్నది మల్టీ-డ్రగ్-రెసిస్టెంట్ టీబీ (MDR-TB) ఉన్నట్లు వైద్య పరీక్షలో తేలింది. ఈ జబ్బు వల్ల నేను ఒక్కసారిగా నేను బరువు తగ్గిపోయాను. నా బరువు 75 కిలో నుంచి 35 కిలోలకు పడిపోయింది. అంతేకాదు వినికిడి శక్తి కూడా దెబ్బతింది. ఆ సమయంలో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాను. నా వ్యాధి గురించి బయటకు తెలిస్తే నా పరువు పోతుందని బయటపడ్డాను. అందుకే ఎవ్వరి నా వ్యాధి గురించి బయటపెట్టలేదు. ఆ తర్వాత నేను ఎంత తప్పుగా ఆలోచించాను అనిపించింది. నేను పడిన ఈ ఒత్తిడిని ఎవరు పడోద్దని అనుకున్నారు. దీంతో ఈ టీబీ వ్యాధి గురించి అవగాహన కల్పించాలని దృఢంగా సంకల్పించుకున్నాను”అని చెప్పుకొచ్చారు.

Exit mobile version
Skip to toolbar