Simran Open Up about ‘Aunty Role And Dabba Roles’ Comment Controversy: ఆంటీ రోల్స్ అంటూ తనని హేళను చేస్తూ కామెంట్స్ చేసిన నటి.. తనను క్షమాపణలు కోరిందని చెప్పింది సీనియర్ నటి సిమ్రాన్. ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్లో నటి సిమ్రాన్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. తన కో-స్టార్‌లో ఒకరిని తన సినిమాలోని పాత్రను ప్రశంసిస్తూ మెసేజ్ చేశానని, దానికి ఆమె ఇచ్చిన రిప్లై తనని చాలా బాధించిందని చెప్పింది.
ఆంటీ రోల్స్ కంటే.. ఇలాంటి పాత్రలు చాలా ఉత్తమమంటూ సమాధానం ఇచ్చిందని చెప్పింది. ఆమె మాటలు తనని బాధించాయని, ఈ అవార్డు స్టేజ్ వేదికగా తనకు దీనికి సమాధానం ఇవ్వాలనుకుంటున్నానంటూ.. పనికి మాలిన డబ్బా రోల్స్ కంటే.. అమ్మ, ఆంటీ రోల్స్ చాలా బెటర్ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అప్పుడు ఆమె చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఆమె నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ రిలీజైంది. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న సిమ్రాన్ ఈ వివాదంపై స్పందించింది.
“నేను డబ్బా కార్టెల్ మూవీ చూశాను. చాలా బాగుంటుంది. అయితే అవార్డు ఫంక్షన్లో నేను చేసిన కామెంట్స్ అందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేశానో తనకి ఆ సందేశం అందింది. ఆ తర్వాత ఆమె నాకు ఫోన్ చేసి క్షమాపణలు చేసింది” అని సిమ్రాన్ చెప్పుకొచ్చింది. అయితే తనని బాధించడం ఆమె ఉద్దేశం కాదందని, ఈ విషయంలో ప్రజలు అనవసరంగా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారని పేర్కొంది. అనంతరం ఇండస్ట్రీలో తనకు ఎక్కువమంది స్నేహితులు రాలేరని, ఎవరి గురించి గాసిప్‌లు మాట్లాడనంది. తాను చెప్పాలనుకుంది సూటిగా బహిరంగంగా చెబుతానని సిమ్రాన్ స్పష్టం చేసింది.