Prime9

Actress Pays Alimony to Husband: విడాకుల తర్వాత భర్తకే భరణం ఇచ్చిన ఆ నటి ఎవరో తెలుసా? – ఎన్ని వందల కోట్లంటే

Shweta Tiwari Give Alimony to Ex Husband Raja Chaudhary: సినీ పరిశ్రమలో ప్రేమ.. పెళ్లి.. విడాకులు సర్వసాధారణం. ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. సినీ సెలబ్రిటీల విడాకులంటే కొంతకాలం పాటు మీడియా, సోషల్‌ మీడియాలో బాగా చర్చ, రచ్చ జరుగుతుంది. ముఖ్యంగా విడిపోయిన జంటల్లో ఆ భర్త.. భార్యకు ఎంత భరణం ఇచ్చాడు, ఎంత ఇవ్వబోతున్నాడనేది చర్చనీయాంశమవుతుంది. భరణం అంటే విడిపోయిన తర్వాత ఆ మహిళ సంరక్షణకు భర్త ఇచ్చేది.

 

భరణం వద్దన్న సమంత

సాధారణ ప్రజల నుంచి సినీ సెలబ్రిటీల వరకు ఇప్పటివరకు భర్తలే.. భార్యలకు భరణం ఇచ్చారు. విడిపోతున్న సమయంలో సెలబ్రిటీల జంటల్లో భార్యలు వందల కోట్ల భరణం కావాలని డిమాండ్‌ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి తమిళ నటుడు జయం రవి, ఆయన భార్య విడాకుల ఉదాహరణ. భర్త భరణం ఇస్తానన్నా.. వాటిని సునాయాసంగా వదిలేసినవారు కూడా ఉన్నారు. అందులో స్టార్‌ హీరోయిన్‌ సమంత ఒకరు. తన భర్త నాగ చైతన్య రూ. 200 కోట్లు భరణం ఇవ్వడానికి రెడీ అయినా.. సమంత దానికి తిరస్కరించింది. ఇది ఆమెపై గౌరవాన్ని మరింత పెంచింది. ఇవన్ని ఒక ఎత్తయితే.. ఓ హీరోయిన్‌ ఏకంగా భర్తకే తిరిగి భరణం ఇచ్చింది.

 

భర్తకు నటి భరణం.. 

భరణం తీసుకోకపోగా.. భర్తకి తిరిగి వంద కోట్ల విలువైన ఆస్తులను తిరిగి ఇచ్చింది. ఎందుకంటే తన బిడ్డల సంరక్షణ కోసమే అని చెప్పడంతో ఆమె నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. ఆమె గొప్ప తల్లి అంటూ ప్రతిఒక్కరి నుంచి ప్రశంసలు అందుకుంటుంది. ఇంతకీ ఆ నటి ఎవరంటే.. ప్రముఖ సీరియల్‌ నటి శ్వేతా తివారి. 2007లో శ్వేతా తన భర్త రాజా నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. గ్రహా హింస కింద ఆమె విడాకులకు దరఖాస్తూ చేసింది. ఐదేళ్ల పోరాటం అనంతరం ఆమెకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. 1997లో రాజాతో ఆమె వివాహం జరిగింది. రాజా మద్యపానం అలవాటు, గృహ హింస ఆమెను విడాకుల కారణంగా చూపించింది.

 

రూ. 93 లక్షల ప్లాట్ రాసిచ్చిన శ్వేతా

ఇదంత ప్రూవ్‌ అయ్యి విడాకులు వచ్చేసరికి ఐదేళ్లు పెట్టింది. అలా ఆమె 2007లో రాజాతో విడాకులు తీసుకుంది. సెటిల్మెంట్‌లో భాగంగా ఇరువురి లాయర్లు తమ ఉమ్మడి ఆస్తీని పిల్లల కోసం అలాగే కొనసాగించాలని సూచించింది. అయితే దీనికి రాజా నిరాకరించాడు. దీంతో ఇద్దరి పేరుపై ఉన్న రూ. 93 లక్షల ప్లాట్‌ను తన భర్త పేరుపై రిజిస్ట్రార్‌ చేయించింది. అలా ఇతర సెటిల్‌మెంట్స్‌తో కలిసి మొత్తం రూ. 100 కోట్లు ఆమె తిరిగి భర్తకు ఇచ్చేసిందని తెలుస్తోంది. ఎందుకు అంటే.. ఇది తన కూతురు సంరక్షణ కోసమని చెబుతోంది శ్వేతా. తన పిల్లల సంరక్షణ కంటే తనకు ఏది ముఖ్యం కాదని, తన పిల్లల క్షేమం కోసం సర్వస్వం కోల్పోయిన తనకు బాధ లేదని చెప్పింది. కాగా రాజాతో విడాకుల తర్వాత 2013లో అభినవ్‌ కోహ్లిని ఆమె రెండో వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొంతకాలనికి అతడితో కూడా విడిపోయింది.

Exit mobile version
Skip to toolbar