Site icon Prime9

Radhika Apte: బేబీ బంప్‌తో షాకిచ్చిన బాలయ్య ‘లెజెండ్‌’ హీరోయిన్‌ – ఇంతకి పెళ్లి ఎప్పుడు అయ్యింది రాధికా?

Radhika Apte

Radhika Apte Pregnancy

Radhika Apte  Baby Bump: నందమూరి బాలకృష్ణ హీరోయిన్‌, ‘లెజెండ్‌’ భామ రాధికా ఆప్టే ఫ్యాన్స్‌కి షాకిచ్చింది. రీసెంట్‌గా జరిగిన బీఎఫ్ఐ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ (BFI London Film Festival 2024) కార్యక్రమానికి హాజరైన ఆమెను చూసి తెలుగు, హిందీ ఆడియన్స్‌ అంతా షాకయ్యారు. రాధికా ఆఫ్టే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఆమె రామ్‌ గోపాల్‌ వర్మ ‘రక్త చరిత్ర’, బాలయ్య ‘లెజెండ్’ చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది. అలాగే హిందీలోనూ పలు సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల్లో నటించింది. ముఖ్యంగా ‘లస్ట్‌ స్టోరీస్‌’ వంటి వెబ్‌ సరీస్‌లో బోల్డ్‌గా నటించి సెన్సేషన్‌ అయ్యింది. అలా సౌత్‌, నార్త్‌లో నటిగా, బోల్డ్‌ బ్యూటీగా గుర్తింపు పొందిన రాధికా ఈ మధ్య తెరపై కనిపించి చాలా కాలం అయ్యింది.

లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఆమె బీఎఫ్‌ఐ లండన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఈవెంట్‌కు హాజరైన ఆమె బేబీ బంప్‌తో కనిపించి షాకిచ్చింది. అలా ఆమెను చూసి ఇండియన్‌ ఆడియన్స్‌ అంతా సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. చాలా గ్యాప్‌ తర్వాత కనిపించడం, పైగా మె బేబీ బంప్‌తో దర్నం ఇవ్వడంతో అంతా ఆమె పెళ్లి ఎప్పుడయ్యిందని ఆరా తీస్తున్నారు. ఏదేమైనా తమ అభిమాన నటి తల్లికాబోతుందని తెలిసి ఫ్యాన్స్‌ మాత్రం ఖుష్‌ అవుతున్నారు. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఫెస్టివల్‌కు హాజరైన రాధికా ఈ ఫోటోలను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో అంతా ఆమె బేబీ బంప్‌ గురించి చర్చించుకుంటున్నారు.

రాధికా పెళ్లి ఎప్పుడు చేసుకున్నావు?

బీఎఫ్ఐ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ హాజరైన రాధికా తన ఫోటోలను షేర్‌ చేసింది. ఇందులో ఆమె బేబీ బంప్‌తో కనిపించడం నెటిజన్లంతా ఆమె ప్రెగ్నెన్సీ, పెళ్లి గురించి చర్చిస్తున్నారు. కొందరైతే నేరుగా రాధికానే పెళ్లి ఎప్పుడు చేసుకున్నావ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి ఈ లెజెండ్‌ బ్యూటీ బేబీ బంప్‌తో కనిపించడంతో ఆమె భర్త ఎవరా అని కూడా ఆరా తీస్తున్నారు నెటిజన్స్‌. నిజానికి రాధికా పెళ్లిపై అందరిలో సందేహం నెలకొనడానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే సినిమాల్లో వచ్చాక ఈ భామ పెళ్లి చేసుకున్నట్టు కానీ, ఒకరితో డేటింగ్‌ చేసినట్టు కానీ కనిపించలేదు. ఎప్పుడు సింగిల్‌గా కనిపించేది.

ఆమె కూడా తన పెళ్లి గురించి ఎక్కడ స్పందించలేదు. ఇక రీసెంట్‌ టైంలో ఆమె పెళ్లి చేసుకున్నట్టు వార్తలు కూడా వినిపంచకపోవడంతో ఆమె బేబీ బంప్‌ చూసి ఫ్యాన్స్‌ అంతా సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. అయితే రాధికా సినిమాల్లోకి రాకముందే పెళ్లి చేసుకుందట. ఆమె భర్త పేరు బెనెడిక్ట్‌ టైలర్‌. అతను బ్రిటిష్‌కు చెందిన మ్యూజిక్‌ కంపోజర్‌. వీరి వివాహం 2012లో జరిగిందట. ఆ తర్వాత ఆమె సినిమాల్లోకి రావడం జరిగింది. పెళ్లి తర్వాత ఆమె నటించిన లెజెండ్‌, హిందీ సినిమాలు ‘ఫోరెన్సిక్’, ‘విక్రమ్ వేద’, ‘మోనికా ఓ మై డార్లింగ్’ 2013లో విడుదల అయ్యాయి. ఇక ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో ‘సిస్టర్ మిడ్ నైట్’ మూవీ తెరకెక్కింది. ఈ సినిమానే బీఎఫ్ఐ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాధికా ఆ ఫోటోలను తన ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేయడంతో ఆమె హాట్‌టాపిక్‌ అయ్యింది.

Exit mobile version