Actor Val Kilmer dies of pneumonia: ప్రముఖ హాలీవుడ్ నటుడు వాల్ కిల్మర్(65) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన గొంతు క్యాన్సర్‌తో పోరాడుతున్నాడని తెలుస్తోంది. తాజాగా, న్యూమోనియాతో ఆయన బాధపడుతుండగా.. లాస్ ఎంజిల్స్‌లో ఓ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించినట్లు ఆయన కూతురు మెర్సిడెస్ కిల్మర్ తెలిపారు.
కాగా,న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. న్యూమోనియా కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించినట్లు ఆయన కుమార్తె మెర్సిడెస్ కిల్మర్ వెల్లడించారు. అయితే వాల్ కిల్మర్.. 2014 నుంచి గొంతు క్యాన్సర్‌తో బాధపడుతుండగా.. ఇటీవల ఆ క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారని ఆమె చెప్పారు.
ఇదిలా ఉండగా 1990 ఏడాదిలో హాలీవుడ్ పరిశ్రమలో ప్రముఖ నటుల్లో వాల్ కిల్మర్ ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన నటనకు గానూ ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. 1995లో వచ్చిన బ్యాట్‌మ్యాన్ ఫరెవర్ సినిమలో టైటిల్ రోల్‌తో కిల్మర్ ప్రసిద్ధి పొందారు. ఆ తర్వాత టాప్ గన్, టాప్ గన్:మావ్రిక్ విల్లో, ది డోర్స్, టాప్ సీక్రెట్ వంటి చిత్రాల్లో నటించారు.
1984లో స్పై పేరడీ టాప్ సీక్రెట్ సినిమాతో వాల్ కిల్మర్ హాలీవుడ్ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చాడు. 1985లో రియల్ జీనియస్ వంటి కామెడీ చిత్రంతో ఆకట్టుకున్నాడు. 1986లో టాప్ గన్ సినిమాలో టామ్ క్రూజ్‌తో కలిసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
అలాగే టూంబ్ స్టోన్, హీట్, ది సెయింట్ వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆ తర్వాత 2021లో టాప్ గన్:మావెరిక్ సినిమాతో తిరిగి హిట్ పొందాడు. కానీ క్యాన్సర్ కారణంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన..శాంటా ఫే సమీపంలోని ఓ గోశాలలో నివాసం ఉంటున్నాడు.