Actor Rahul Ravindran Father Passed Away: ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ కన్నుమూశారు. ఈ విషాద వార్తను రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. మూడు రోజుల క్రితం ఆయన చనిపోయారని తెలిపాడు. ఈ సందర్భంగా తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రాహుల్ భావోద్వేగానికి లోనయ్యారు.
“మా నాన్న రవీంద్రన్ నరసింహన్ మూడు రోజుల క్రితం మరణించారు. కష్టపడి పనిచేసేవారు, నిజాయితీపరులుగా మంచి జీవితాన్ని గడిపారు. మీరూ ఎప్పటికీ మా జ్ఞాపకాలలో సజీవంగా ఉంటారు నాన్న. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. ‘చి లా సౌ’ సినిమాకు కథ రాస్తున్నప్పుడు ఓ లైన్ రాశాను. అది ఎప్పుడు నా మనసుకి దగ్గరగా అనిపిస్తుంది. ‘నాన్న ఉన్నారు లే, చుస్కుంటారు’ అనే మాట కి విలువ నాన్నని కొల్పోయిన వాల్లకే మాత్రమే తెలుసు. నాకు అది ఈరోజు అర్థమవుతుంది.
మీరు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. ఆ బాధను మాటల్లో చెప్పలేను. థ్యాంక్యూ నాన్న” అంటూ రాసుకొచ్చారు. ఇది తెలిసి ఆయన సన్నిహితులు, ఇండస్ట్రీ ప్రముఖులు, నటీనటులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు అర్పిస్తున్నారు. అలాగే రాహుల్‌ని పరామర్శిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన రవీంద్రన్ ప్రస్తుతం రైటర్‌గా, దర్శకుడిగా సత్తా చాటుకుంటున్నాడు. అందాల రాక్షసి చిత్రంతో టాలీవుడ్‌కి హీరో పరిచయమైన రాహుల్ ఆ తర్వాత సహా నటుడి పాత్రలు, ప్రతి కథానాయకుడి పాత్రలు పోషిస్తున్నాడు.