UPSC Notification: కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేసేందుకు యూపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ సర్జన్, మెడికల్ ఆఫీసర్, స్పెషలిస్ట్ గ్రేడ్ 3 సహా పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 113 పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులు నుంచి ధరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుల కోసం జూన్ 29 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు వీలు కల్పించారు. పోస్టుల వారీ దరఖాస్తు కోసం https://upsconline.nic.in/ora/VacancyNoticePub.php ను సంప్రదించవచ్చు.
నోటిఫికేషన్‌లో వివరాలు(UPSC Notification)
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు జూన్ 29 రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తును ప్రింట్ తీసుకోవడానికి జూన్ 30 రాత్రి 23.59 గంటల వరకు అవకాశం కల్పించారు. ఇంటర్వూకు షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు ఆన్‌లైన్ అప్లికేషన్‌ను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. దరఖాస్తు కోసం మహిళలు/ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు మినహా మిగతా అభ్యర్థులందరికీ రూ. 25 ల చొప్పున పీజు చెల్లించాల్సి ఉంటుంది.
యూపీఎస్సీ వెబ్‌సైట్ upsconline.nic.in ఓపెన్ చేసి అక్కడ OTR లింక్‌పై క్లిక్ చేసి అభ్యర్థుల ప్రొఫైల్‌ను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎంచుకున్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
విభాగాల వారీగా విద్యార్హతలు, వయో పరిమితి, అనుభవం, పే స్కేలు తదితర వివరాలన్నీ నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.