UPSC Free Coaching for Merit Students in BC Study Circle: నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.రాష్ట్రంలో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్ కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సివిల్ సర్వీసెస్ 2026 లాంగ్ టర్మ్ కోచింగ్ క్లాసెస్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఇందులో ప్రిలిమ్స్ తో పాటు మెయిన్స్ కోచింగ్ కూడా ఇవ్వనున్నారు. ఈ మేరకు 25 జులై 2025న సివిల్స్ తరగతులు ప్రారంభమై 30 ఏప్రిల్ 2026 వరకు ఉంటాయని తెలిపింది. తరగతులు సైదాబాద్‌లోని లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న టీజీ బీసీ స్టడీ సర్కిల్‌లో నిర్వహించనున్నట్లు డైరెక్టర్ తెలిపారు.
మొత్తం 150 మందికి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. వీరందరికీ 12 జులై 2025న ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి మెరిట్ ఆధారంగా 100 మందిని ఎంపిక చేయనున్నారు. మరో 50 మందిని గతేడాది ప్రిలిమ్స్ లో క్వాలీఫై అయిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత గల అభ్యర్థులు సంబంధిత పత్రాలతో టీజీ బీసీ స్టడీ సర్కిల్ సైదాబాద్‌లో 16 జూన్ 2025నుంచి 8 జులై 2025 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ కోచింగ్ కోసం సీటు వచ్చిన అభ్యర్థులకు రూమ, ట్రావెలింగ్ కోసం నెలకు రూ.5వేల స్టైఫండ్, రూ.5 వేలు బుక్స్ కోసం ఒక్కసారి మాత్రమే పంపిణీ చేస్తారు. దీంతో పాటు లైబ్రరీ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. అభ్యర్థులు రేపటినుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. www.tgbcstudycircle.cgg.gov.in వెబ్ సైట్ లో 8 జులై 2025 వరకు గడువు విధించారు. ఇతరు వివరాలకు 040-24071178 నంబర్‌ను ఫోన్ చేసి తెలుసుకోవాలని సూచించారు.