Site icon Prime9

TET Exam: గుడ్ న్యూస్.. జనవరి 2 నుంచి టెట్

TS TET Exam 2024 Schedule Released: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) షెడ్యూల్‌ను బుధవారం పాఠశాల విద్యశాఖ డైరెక్టర్‌ విడుదల చేశారు. సబ్జెక్టుల వారీగా షెడ్యూల్‌ను విడుదల చేశారు. జనవరి 2 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు సెషన్లుగా పరీక్ష జరుగనున్నది. ఉదయం 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు పరీక్షలు జరగనున్నాయి.

అయితే ఈసారి టెట్‌ పేపర్‌-1, పేపర్‌-2లకు కలిపి సుమారు 2.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 91 7075028882 / 85 నంబర్లను సంప్రదించవచ్చు. హాల్ టికెట్ల కోసం https://tstet2024.aptonline.in/tstet/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

Exit mobile version