TGPSC new Job Notifications From May: నిరుద్యోగులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు మే 1 నుంచి కొత్త నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. ఇప్పటికే మార్చి 31లోగా ఉన్నటువంటి ఉద్యోగ ఖాళీల వివరాలు, పెండింగ్ నోటిఫికేషన్ల ఫలితాలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
అలాగే, ఇప్పటివరకు నిర్వహించిన గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటినుంచి పరీక్ష ఫలితాల్లో సైతం ఎలాంటి ఆలస్యం జరగకుండా ఇవ్వనున్నట్లు తెలిపారు. మరో వారం, పది రోజుల్లో ఫలితాలు వస్తాయన్నారు. కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వడంతో పాటు 6 నుంచి 8 నెలల్లోనే నియామకాలు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం యూపీఎస్సీ, ఎస్ఎస్‌సీ ఫార్మాట్ విధానంలో వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.