Site icon Prime9

Group-1 Exams: మెయిన్స్ పరీక్షల నిర్వహణకు లైన్ క్లియర్.. యధావిధిగా గ్రూప్ 1 మెయిన్స్

TGPSC Group-I Mains Exams: తెలంగాణ గ్రూపు-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్ అయింది. గ్రూపు-1 నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది. కాగా, 2022 గ్రూప్ -1 నోటిఫికేషన్‌ను పక్కన పెట్టి 2024లో రేవంత్ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం చట్ట విరుద్దమని కొందరు అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవలి ప్రిలిమ్స్ పరీక్షల్లో 14 తప్పులున్నాయని చెబుతూ, త్వరలో జరప తలపెట్టిన మెయిన్స్‌ను వాయిదా వేయాలని కోరారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు కొత్త నోటిఫికేషన్ రద్దు కుదరదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో కోర్టుల జోక్యం అనవసరమని అభిప్రాయపడింది. దీంతో యధావిధిగా మెయిన్స్ పరీక్షల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది.

Exit mobile version