Site icon Prime9

TGPSC: బిగ్ అలర్ట్.. గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. హాల్ టికెట్లపై కీలక అప్డేట్

TGPSC Group 2 Hall Ticket 2024: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్-2 అభ్యర్థులకు సంబంధించిన పరీక్షల హాల్ టికెట్ల అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు డిసెంబర్ 9 నుంచి గ్రూప్ 2 అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు టీజీపీఎస్పీ తెలిపింది.

గ్రూప్-2 పరీక్షలు డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించనున్నట్లు టీజీపీఎస్పీ పేర్కొంది. రోజూ రెండు సెషన్‌లలో పరీక్షలు జరగనున్నట్లు ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు మొదటి సెషన్‌లో నిర్వహిస్తుండగా.. మధ్యాహ్నం 3  గంటల నుంచి 5.30 గంటల వరకు రెండో సెషన్ జరగనుంది. ఇక, ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 788 గ్రూప్ 2 పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోస్టులకు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

అయితే, అభ్యర్థులు రెండు గంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 8.30 గంటల నుంచి అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇస్తామని టీజీపీఎస్పీ పేర్కొంది. ఇతర వివరాల కోసం 040 – 23542185 లేదా 040 – 23542187 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవాలని సూచించారు.

Exit mobile version