Prime9

TG TET 2025: టెట్ హాల్ టికెట్లు రిలీజ్.. జూన్ 18 నుంచి ఎగ్జామ్స్

Hall Tickets: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2025) సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. టెట్ పరీక్షకు అప్లై చేసిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేది వివరాలు అఫిషియల్ వెబ్ సైట్ లో నమోదు చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కాగా టెట్ పరీక్షలు జూన్ 18 నుంచి ఆన్ లైన్ లో జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనుండగా.. ఉదయం 9 గంటల నుంచి 11.30 మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ జరగనుంది.

కాగా ఇప్పటికే విడుదలైన షెడ్యూల్ ప్రకారం మొత్తం తొమ్మిది రోజులపాటు 16 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 18, 19,20, 23, 24, 27,28,29,30 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 23న మధ్యాహ్నం, జూన్ 28న ఉదయం విడతల్లో మాత్రమే పరీక్షలు జరగుతాయని అధికారులు చెప్పారు. కాగా జూన్ సెషన్ టెట్ పరీక్షకు సంబంధించి రాష్ట్రంలో మొత్తం 1,83,653 దరఖాస్తులు వచ్చాయని విద్యాశాఖ చెప్పింది. ఇందులో పేపర్ 1కు 63,261 మంది, పేపర్ 2కు 1,20,392 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Exit mobile version
Skip to toolbar