Site icon Prime9

TG TET Schedule: జనవరి 2 నుంచి టెట్.. అభ్యర్థులకు కీలక సూచనలు

Telangana TET 2024 schedule announced: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జనవరి 2 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. సెషన్-1 పరీక్షలు ఉదయం 9.00 నుంచి 11.30 వరకు, సెషన్ 2 పరీక్షలు మధ్యాహ్నం 2.00 నుంచి 4.30 వరకు నిర్వహించనున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు.

పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందే అభ్యర్థులను అనుమతిస్తామని, పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు గేట్లు ముసివేస్తామని తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తోపాటు బ్లాక్/ బ్లూ బాల్ పాయింట్ పెన్, ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డు తీసుకెళ్లాలి. ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షకేంద్రం లోపలికి తీసుకెళ్లడానికి వీలు లేదు.

Exit mobile version