TG TET 2024: టెట్ హాల్ టికెట్లు రిలీజ్.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

Telangana TET 2024 Hall Tickets released: టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. తెలంగాణ విద్యాశాఖ టెట్ హాల్ టికెట్లను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 పరీక్షలకు మొత్తం 2,48,172 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు జనవరి 8, 9, 10,18తేదీలలో టెట్ పేపర్ -1 పరీక్ష ఉండగా.. టెట్ పేపర్ -2 పరీక్ష జనవరి 2, 5, 11, 12, 19, 20వ తేదీలలో ఉండనుంది.

కాగా, ఈ పరీక్షలు రెండు సెషన్లలో జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు ఉండగా.. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి మధ్యాహ్నం 4.30 నిమిషాల వరకు జరగనున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వం విద్యాసంస్థల్లో టీచింగ్ విధులకు ఎంపికయ్యేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తుండగా.. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో ఈ టెట్ మార్కులు పరిగణలోకి తీసుకుంటారు. అయితే జనవరి 2వ తేదీన పరీక్షలు ప్రారంభమై జనవరి 20 వరకు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 5న టెట్ ఫలితాలు వెలువడనున్నాయి.

ఇక, హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు అభ్యర్థులు ముందుగా https://tgtet2024.aptonline.in/tgtet/ వెబ్ సైట్‌ను సందర్శించాలి. ఆ తర్వాత Download TET Hall Tickets (II) 2024 బటన్ క్లిక్ చేస్తే మరో పేజీ వస్తుంది. ఇందులో అభ్యర్థుల రిజిస్ట్రేషన్ వివరాలు, పుట్టిన తేదీ నమోదు చేయాలి. అనంతరం సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే హాల్ టికెట్ వస్తుంది. తర్వాత డౌన్ లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే డౌన్ లోడ్ అవుతుంది.