Site icon Prime9

SBI CBO: నెగెటివ్ మార్కింగ్ లేదు.. నిరుద్యోగులు త్వరపడండి.. ఎస్బీఐలో సర్కిల్‌ బేస్‌డ్‌ ఆఫీసర్ పోస్టులు

SBI Server Down

SBI Server Down

SBI CBO: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 1422 సర్కిల్‌ బేస్‌డ్‌ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి గానూ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. అయితే వీటిలో తెలుగు రాష్ట్రాల్లో 175 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసిగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొనింది.

వయస్సు: అలాగే దరఖాస్తు దారుల సెప్టెంబర్‌ 30, 2022వ తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్ల వయసు మధ్య ఉండాలని వెల్లడించింది. ఈ అర్హతలుండి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా నవంబర్‌ 7,2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు తెలిపింది.

ఫీజు: దీనికి గానూ జనరల్ అభ్యర్ధులు రూ.750లు అప్లికేషన్‌ ఫీజును చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

పరీక్ష తేదీ: కాగా రాత పరీక్ష డిసెంబర్‌ 4, 2022వ తేదీన నిర్వహించనున్నారు. హాల్‌ టికెట్లను నవంబర్‌ నెలాఖరులో విడుదల చేస్తారని సమాచారం.
ఈ పరీక్షలన్నింటిలో ప్రతిభకనబరచిన అభ్యర్ధులకు నెలకు రూ.63,840లు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాల కోసం అధికారిక వెబ్ సైట్లో చెక్‌ చేసుకోవచ్చు. ఈ రాత పరీక్షకు నెగిటివ్‌ మార్కింగ్‌ ఉండదు.

పరీక్ష విధానం: మొత్తం 120 మార్కులకు, 120 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు ఆన్‌లైన్‌ విధానంలో 2 గంటల సమయంలో పరీక్ష జరుగుతుంది.

ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌లో 30 ప్రశ్నలకు, బ్యాంకింగ్‌ నాలెడ్జ్‌లో 40 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్‌/ఎకానమీ విభాగంలో 30 ప్రశ్నలు, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌లో  20 ప్రశ్నలకు పరీక్ష జరుగుతుంది.

డిస్క్రిప్టిప్‌ పేపర్: రెండు ఎస్సేలకు 25 మార్కుల చొప్పున 50 మార్కులకు 30 నిముషాల్లో పరీక్ష ఉంటుంది.
ఇంటర్వ్యూ: 50 మార్కులు ఉంటుంది.

ఇదీ చదవండి: గ్రూప్-1 ప్రిలిమ్స్ లో కటాఫ్ ఉండదు

Exit mobile version