Site icon Prime9

NTPC Jobs: 300 పోస్టుల భర్తీకి నోటిషికేషన్ విడుదల చేసిన ఎన్టీపీసీ.. వివరాలివే

NTPC Jobs

NTPC Jobs

NTPC Jobs: జాతీయ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. వివిధ కేటగిరీల్లో 300 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. ఆపరేషన్స్‌/మెయింటీనెన్స్‌ E3 లెవెల్‌లో పనిచేసేందుకు అభ్యర్థులకు గత అనుభవంతో ఈ నియామకాలు చేపట్టనున్నారు. కాబట్టి అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు జూన్‌ 2 వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు.

 

దరఖాస్తు చేసేందుకు క్లిక్‌ చేయండి

 

నోటిఫికేషన్‌ వివరాలు(NTPC Jobs)

అభ్యర్థులు బీఈ/బీ.టెక్‌ (ఎలక్ట్రికల్‌/మెకానికల్‌/ఎలక్ట్రానిక్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌) లో కనీసం 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకైతే పాస్‌ మార్కులు ఉంటే సరిపోతుంది.

200 మెగా వాట్స్‌ అంతకన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన పవర్‌ ప్రాజెక్టు లేదా ప్లాంట్‌లలో కనీసం 7 ఏళ్లు పనిచేసిన అనుభవం అభ్యర్థులకు తప్పనిసరిగా ఉండాలి.

ఈ పోస్టులకు వయో పరిమితి ని 35 ఏళ్లు గా నిర్ణయించారు.

E3 గ్రేడ్‌/ఐడీఏ నెలకు రూ. 60 వేలు నుంచి 1,80,000 లక్షల వరకు వేతనం అందించనున్నారు.

ఎలక్ట్రికల్‌ విభాగంలో 120 ఖాళీలు ఉన్నాయి. మెకానికల్‌ విభాగంలో 120, ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగంలో 60 చొప్పున పోస్టులు ఖాళీలు ఉన్నాయి.

ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, దివ్యాంగులకు వయస్సులో సడలింపు ఇస్తారు.

ఈ పోస్టులకు అభ్యర్థులను నియామక పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 

 

Exit mobile version