Site icon Prime9

Job Notification in AP: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 280 పోస్టులకు నోటిఫికేషన్

Civil Assistant Surgeon Posts in ap: ఏపీలో నిరుద్యోగులకు వైద్యారోగ్య శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో ఖాళీగా ఉన్న 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది.

బ్యాక్ లాగ్, రెగ్యులర్ పోస్టులను.. పీహెచ్ సీలు/ ఇతర వైద్య సంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఆసక్తిగల నిరుద్యోగులు ఈ నెల 4నుంచి 13 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. వివరాల కోసం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారిక వెబ్ సైట్ http:apmsrb.ap.gov.in/ముస్ర్బ్/ను సందర్శించాలని సూచించింది.

Exit mobile version