Site icon Prime9

JEE Main 2023: త్వరలో జేఈఈ మెయిన్ సెషన్‌ 2 అడ్మిట్ కార్డులు

JEE Advanced Exam

JEE Advanced Exam

JEE Main 2023: దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరం ఎంట్రన్స్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జేఈఈ 2023 సెషన్‌ 2 కు సంబంధించి అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీత్వరలోనే విడుదల చేయనుంది. ఏప్రిల్‌ 6 నుంచి 12 తేదీల మధ్య జరిగే ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో వారం రోజుల్లోనే అడ్మిట్‌ కార్డులను విడుదల చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 పరీక్ష కోసం అభ్యర్థులు ఫిబ్రవరి 8 నుంచి మార్చి 12 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకున్న విషయం తెలిసిందే. అడ్మిట్‌ కార్డులతో పాటు పరీక్షలకు సంబంధించిన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.in, Nta.ac.inలలో చెక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ కోసం..(JEE Main 2023)

jeemain.nta.nic.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
హోంపేజీలో జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డు 2023 సెషన్‌-2కు సంబంధించిన లింక్‌పై క్లిక్‌ చేయాలి.
మీ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్‌ చేసుకోవాలి.
జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డు స్క్రీన్‌పై కనబడుతుంది.
ఆ తర్వాత దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఓ కాపీని ప్రింటవుట్‌ తీసుకుని పెట్టుకోవాలి.
కార్డుపై మీరు పరీక్ష రాసే నగరం పేరు, ఇతర వివరాలన్నీ ఉన్నాయో, లేదో సరిచూసుకోవాలి.
ఏదైనా సమస్య ఉంటే jeemain@nta.ac.in.ద్వారా ఎన్‌టీఏకు ఇ-మెయిల్‌ చేయొచ్చు.

 

Exit mobile version