IDBI Notification: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాల దరఖాస్తుకు జూన్ 20 తో గడువు ముగియనుంది. 136 స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు గత నెలలో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. తొలుత జూన్ 1 నుంచి 15 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల అయింది. అయితే ఆ గడువును పొడిగిస్తూ తాజాగా బ్యాంకు నిర్ణయం తీసుకుంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 20 లోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
నోటిఫికేషన్ వివరాలివే..(IDBI Notification)
ఐడీబీఐ లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ కింద ఖాళీగా ఉన్న పోస్టులు 136. ఇందుకోసం జూన్ 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసిన దరఖాస్తులను జులై 5 వరకు ప్రింట్ తీసుకోవచ్చు. బ్యాంకులోని వివిధ విభాగాల్లో 84 మేనేజర్ పోస్టులు, 46 అసిస్టెంట్ జనరల్ మేనేజర్, 6 డిప్యూటీ జనరల్ మేనేజర్ చొప్పున మొత్తం 136 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలన్నింటికీ గతంలో పనిచేసిన అనుభవం తప్పనిసరిగా కావాలి.
ఈ నోటిఫికేషన్లలో పేర్కొన్న ఉద్యోగాలకు హోదాలను బట్టి నెల వేతన స్కేలు ఉంటుంది. ఆయా పోస్టుల హోదాలను బట్టి నెలకు కనిష్ఠంగా రూ. 48,170 నుంచి గరిష్ఠంగా రూ.1. 55 లక్షల వరకు ఉంది. ఈ పోస్టులకు విద్యార్హతలు, జీతం, అనుభవం, ఎంపిక విధానం, పరీక్ష, కనీస వయసు, దరఖాస్తు రుసుం తదితర వివరాలను కింద లింక్ లోని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి