TGPSC Group 2 Hall Ticket Download: గ్రూప్-2 హాల్ టికెట్లను టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. ఈ నెల 15,16 తేదీల్లో జరగనున్న గ్రూప్ 2 పరీక్ష కోసం అభ్యర్థులు సోమవారం నుంచి ఈ నెల 14 వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది.
రోజుకు రెండు సెషన్లుగా.. .
15వ తేదీ ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్-1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్), మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్-2 (చరిత్ర, పాలిటీ, సొసైటీ), 16న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-3(ఎకానమీ మరియు లభివృద్ధి), మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకు పేపర్-4 (తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఆవిర్భావం) పరీక్షలు జరుగుతాయి.
రాష్ట్రవ్యాప్తంగా 1,368 పరీక్షా కేంద్రాలు..
రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 1,368 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయిఅయితే టీజీపీఎస్సీ మొత్తం 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు మొత్తం 5.57 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా, 2024 ఆగస్టులోనే ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా, డీఎస్సీ ఉండటంతో దీనిని వాయిదా వేశారు.
షెడ్యూల్ ప్రకారమే…
తెలంగాణలో యథావిధిగా గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-2, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష ఒకేరోజు ఉన్నందున గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. కాగా, వారి పిటీషన్‌ను విచారించిన న్యాయస్థానం.. వారం రోజుల ముందు అలా పరీక్ష వాయిదా వేయటం కుదరదని సోమవారం స్పష్టం చేసింది. దీంతో ముందు ప్రకటించిన విధంగా ఈ నెల 15, 16న గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి.