TG Inter Exam fee: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్ష ఫీజు గడువు పెంపు

Telangana inter exam fee date extended: తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫీజు గడువును మరోసారి పొడగించినట్లు మంగళవారం ఇంటర్మీడియట్ ప్రకటించింది. రూ.500 ఆలస్య రుసుంతో ఈ నెల 31 వరకు ఫీజు చెల్లింపు గడువును పెంచినట్లు పేర్కొంది. అయితే డిసెంబర్ 17వరకే పరీక్ష ఫీజు గడువు ముగియగా, మరోసారి పొడిగిస్తూ తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర విద్యార్థులతోపాటు, వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు, ప్రైవేట్ అభ్యర్థులకు కూడా వర్తిస్తుందని బోర్డు స్పష్టం చేసింది.