Prime9

Balakishta Reddy : జులై మొదటివారంలో ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ : ఉన్నత విద్యామండలి చైర్మన్‌

Engineering counseling : జులై మొదటివారంలో ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. ఆగస్టు 14లోగా ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు.

 

అనుమతి లేకుండా కొందరు విద్యాసంస్థలు నడుపుతున్నారని పేర్కొన్నారు. అందులోనే విద్యార్థులు చేరుతున్నారని తెలిపారు. నెక్స్ట్‌ వేవ్‌, బైట్‌ ఎక్స్‌ఎల్‌ టెక్‌ ఎడ్‌, లీప్‌ స్టార్ట్‌, ఇంటెల్లిపాత్‌ సంస్థలకు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. వివరణ కోసం ఈ నెల 13వ తేదీ వరకు విద్యాసంస్థలకు గడువు ఇచ్చామన్నారు. డీమ్డ్‌ వర్సిటీతో ఒప్పందం చేసుకున్నట్లు విద్యాసంస్థలు చెబుతున్నాయని తెలిపారు.

 

ఇంజినీరింగ్‌ విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయని తెలిపారు. డీమ్డ్‌ వర్సిటీల అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. బీ కేటగిరీ సీట్ల అంశంపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు. బీ కేటగిరీ సీట్ల కేటాయింపుపై ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. సిలబస్‌ మార్పుపై కసరత్తు చేస్తున్నామని వివరించారు. కోర్సుల ఎంపికపై విద్యార్థులకు హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఉన్నత విద్యామండలిలో సంస్కరణలపై ప్రభుత్వానికి ప్రతిపాదించామని బాలకిష్టారెడ్డి తెలిపారు.

Exit mobile version
Skip to toolbar