Site icon Prime9

DDMS: ఒకేషనల్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

Certificate Courses For Women in DDMS: హైదరాబాద్  నగరంలోని దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ మహిళా సభ వొకేషనల్‌ కోర్సు సెంటర్‌ పలు కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఫార్మసీ అసిస్టెంట్‌, హెల్త్‌కేర్‌ మల్టీపర్పస్‌ వర్కర్‌ (నర్స్‌ కోర్స్‌), ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నీషియన్‌, డయాలసిస్‌ అసిస్టెంట్‌, ప్రీ ప్రైమరీ టీచర్‌ ట్రైనింగ్‌ తదితర సర్టిఫికెట్‌ కోర్సుల్లో చేరేందుకు కనీస అర్హత పదో తరగతి అని పేర్కొన్నారు. ఈసీజీ టెక్నీషియన్‌, రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్‌, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, రేడియోగ్రఫీ అసిస్టెంట్‌, కార్డియాలజీ టెక్నీషియన్‌, పర్‌ఫ్యుజన్‌ టెక్నీషియన్‌, క్యాథ్‌ల్యాబ్‌ టెక్నీషియన్‌ వంటి పారా మెడికల్‌ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు కనీస అర్హత ఇంటర్మీడియట్‌ ఉండాలని తెలియజేశారు. అయితే ఈ కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 14న చివరి తేదీ ఉంటుందని పేర్కొన్నారు. మిగతా వివరాలకు 8309037134, 6305895867 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Exit mobile version