Vinayaka Chavithi : వినాయక చవితి రోజు చంద్రుడును చూసిన వారు ఈ మంత్రం జపిస్తే చాలు

వినాయక చవితి రోజు పూజ ఐపోయిన నిండు చంద్రుణ్ణి చూడకూడదు.అలా చూసిన వాళ్ళకు శుభం కలగదని పురాణాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. పొరపాటున చూసిన వాళ్ళు ఆందోళన పడుతూ ఉంటారు. ఏమయినా జరుగుతుందేమో అని అలాంటి వాళ్ళు ఈ కంటెంట్ ఒక్కసారి చదవండి.చంద్రుణ్ణి చూసిన వారు కింద ఉన్నా మంత్రాన్ని జపిస్తే చాలు.

  • Written By:
  • Publish Date - August 31, 2022 / 12:33 PM IST

Vinayaka Chavithi : వినాయక చవితి రోజు పూజ ఐపోయిన నిండు చంద్రుణ్ణి చూడకూడదు.అలా చూసిన వాళ్ళకు శుభం కలగదని పురాణాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. పొరపాటున చూసిన వాళ్ళు ఆందోళన పడుతూ ఉంటారు. ఏమయినా జరుగుతుందేమో అని అలాంటి వాళ్ళు ఈ కంటెంట్ ఒక్కసారి చదవండి.చంద్రుణ్ణి చూసిన వారు కింద ఉన్నా మంత్రాన్ని జపిస్తే చాలు.

మనం ఇంట్లో చేసే ఏ కొత్త పనుల కైన ఏ పని మొదలు పెట్టాలనుకున్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన హిందూ వారు ఖచ్చితంగా పాటించాలిసిన సంప్రదాయం.వినాయకుడి పుట్టిన రోజున మనం ‘వినాయక చవితి’ లేదా ‘ గణేశ చతుర్ధి’ పండుగులా జరుపుకుంటాము. వినాయక చవితి రోజున వినాయకుడి విగ్రహాన్ని ప్రతి యొక్క ఇంటిలో పెట్టుకొని స్వామివారికి పూజలు చేసి పచ్చ గరికతో పాటు,21 పత్రాలను పెట్టి , వినాయకుడి కథ వినుకుంటూ ఉండ్రాళ్ళు, కుడుములను స్వామి వారికి నైవేద్యంగా పెట్టుకోవేలెను.

చవితి రోజున చంద్రుణ్ణి చూడడం దోషమనీ అంటారు. కానీ చవితి రోజే చంద్రుడు నిండుగా మనకి కనిపిస్తాడు కానీ చవితి రోజు మనం చంద్రుడును చూడకూడదు. ఓక్కో పొరపాటున చంద్రుడును చూస్తాము . చూసిన వెంటనే ఈ మంతాన్ని జపిస్తే ,మీ దోషం తొలగిపోయి మంచి జరుగుతుంది.

సింహః ప్రసేన మవదీత్,
సింహో జాంబవంతాహతః,
సుకుమారక మారోధి,
స్తవహ్యేశ స్యమంతకః