Vastu Tips : హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి మణహి ప్రాముఖ్యత ఉంది. ఇల్లు, భవన నిర్మాణంలో కానీ ఏ దిశలో ఏది ఉంచాలని విషయంలో కానీ ప్రతి ఒక్కరూ వాస్తు శాస్త్రాన్ని బాగా నమ్ముతారు. అయితే ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అయ్యే వారి కోసం కూడా వాస్తు శాస్త్రంలో వారికి ఉపయోగపడే విధంగా పలు అంశాలు ఉన్నాయి. కాగా వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల విగ్రహాలను ఇంట్లో సరైన దిశలో పెట్టి పూజించడం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో మరి ఇంట్లో పెట్టుకోవాల్సిన ఆ విగ్రహాలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..
తాబేలు విగ్రహం..
హిందూ సంప్రదాయాల ప్రకారం తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు. కనుక ఈ విగ్రహం ఇంట్లో ఉండటం వల్ల సకల సంపదలకు ఏమాత్రం లోటు ఉండదు అని చెబుతూ ఉంటారు. ఇక ఈ తాబేలు విగ్రహాన్ని ఇంట్లో తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచడం ఎంతో మంచిది.
ఏనుగు విగ్రహం..
ఇంట్లో ఏనుగు విగ్రహం ఉండడం అనేది వాస్తు శాస్త్రం ప్రకారం శుభ సంకేతంగా పరిగణిస్తారు. అయితే ఎవరి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వారు ఏనుగు విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవచ్చు. కొందరు వెండి ఏనుగు విగ్రహాలను ఏర్పాటు చేయగా.. మరికొందరు ఇత్తడి విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇంట్లో పెట్టుకునే ఏనుగు విగ్రహాలలో తొండం ఎప్పుడు పైకి ఎత్తినవి ఉండడం మంచిది. ఇలాంటి ఏనుగు విగ్రహాలు ఇంట్లో ఉండడం వల్ల రాహు దోషాన్ని తొలగించడంతోపాటు ఆర్ధిక ఇబ్బందులను తొలగిస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
చేప విగ్రహం..
ఇంట్లో చేప విగ్రహం వెండిది లేదా ఇత్తడిది కనుక ఉంచినట్లయితే ఆ ఇంట్లో ఆర్థిక అభివృద్ధి ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ చేప విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్య దిశలో పెట్టడం ఎంతో శుభ సూచకం అని సూచిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు లేకుండా, కుటుంబ సభ్యులందరూ సుఖసంతోషాలతో ఉంటారని వాస్తు శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వంట గదిలో ఉండాల్సిన వస్తువులు (Vastu Tips)..
అదే విధంగా వంట గదిలో కూడా తప్పకుండా ఉండాల్సిన వస్తువులు కొన్ని ఉన్నాయి. వాటిని వంట గదిలో ఉంచడం ద్వారా కూడా ఆర్ధిక ఇబ్బందులను తొలగించవచ్చు అని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏంటంటే??
పసుపు..
పసుపు గురు గ్రహాన్ని చూసిస్తుంది కనుక వంట గదిలో ఎల్లప్పుడూ పసుపు తప్పనిసరిగా ఉండాలి. పసుపు వంట గదిలో ఖాళీ కాకుండా చూసుకోవాలి.
ఉప్పు..
వంట గదిలో తప్పనిసరిగా ఉండాల్సిన వాటిల్లో ఉప్పు కూడా ఒకటి. ఉప్పు ముందుగానే ఇంట్లో నిల్వ చేసి పెట్టుకోవడం మంచిది. ఎప్పుడైతే మన ఇంట్లో ఉప్పు లేకుండా ఉంటుందో ఆ సమయంలో మన ఇంట్లో ప్రతికూలత ఏర్పడుతుంది.
ఆవాల నూనె..
ఆవాల నూనె తప్పనిసరిగా ఇంటిలో ఉండాలి. ఎప్పుడైతే మన ఇంట్లో ఆవాల నూనె ఉండదో ఆ సమయంలో శనీశ్వరుని కోపానికి గురి కావాల్సి ఉంటుంది అని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే తప్పనిసరిగా వంటగదిలో ఈ వస్తువులు ఎల్లప్పుడూ ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు.
బియ్యం..
వంట గదిలో ఎల్లప్పుడూ బియ్యం నిల్వ ఉండాలి. బియ్యం ఎప్పుడైతే వంట గదిలో ఉండవో శుక్ర గ్రహ ప్రభావం మనపై పడుతుంది. ఇంట్లో బియ్యం ఉండడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/