Vastu Tips : ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు కావచ్చు.. పని ఒత్తిడి, అలవాట్లు.. ఇలా పలు కారణాల రీత్యా నిద్ర లేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో కూడా ఎక్కువ సేపు మొబైల్ ఫోన్ లను చూస్తూ నిద్రని డుమ్మా కొట్టేస్తున్నారు. కానీ మనిషికి ప్రశాంతమైన నిద్ర అవసరం. మనం ఎంత ప్రశాంతంగా ఉంటే మన ఆరోగ్యం కూడా అంత బాగుంటుంది. అయితే కొంతమంది మాత్రం సరిగ్గా నిద్రపోలేక అవస్థ పడుతూ ఉంటారు. పడుకున్నప్పటికి నిద్ర పట్టదు. అందుకే ఇప్పుడు అలాంటి వారి కోసమే.. ఈ రోజు కొన్ని విషయాల మీకు చెప్పబోతున్నాం. వాస్తు శాస్త్రం అనేక సమస్యలకు సంతృప్తికరమైన పరిష్కారాలను అందించింది. దీని ప్రకారం, దిండు కింద కొన్ని వస్తువులను ఉంచడం వల్ల మానసిక మరియు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు. ఆ విషయాలు ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం ఏ ఏ వస్తువులు ఉండాలంటే (Vastu Tips)..
సువాసనగల పువ్వులు..
పడుకునే ముందు దిండు కింద సువాసనగల పువ్వులను ఉంచడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఒత్తిడి తగ్గుతుంది. దీంతో వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
నాణెం..
పడుకునేటప్పుడు దిండు కింద నాణెం పడుకునేటప్పుడు దిండు కింద నాణెం పెట్టుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఈ నాణెం తూర్పు దిశలో ఉంచాలి.
వెల్లుల్లి..
దిండు కింద వెల్లుల్లిని ఉంచండి.. వెల్లుల్లిని దిండు కింద ఉంచడం సహాయపడుతుంది. ఇది సానుకూలతను ప్రోత్సహిస్తుంది మరియు లోతైన నిద్రను ప్రేరేపిస్తుంది. చెడు కలలు కూడా రావు.
పచ్చి ఏలకులు..
పచ్చి ఏలకులు పచ్చి ఏలకులు లేదా పచ్చి మిరపకాయలను దిండు కింద ఉంచడం వల్ల మంచి నిద్ర వస్తుంది మరియు ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.
సోంపు..
సోంపు నిద్రపోయేటప్పుడు దిండు కింద సోంపును పెట్టుకోవడం వల్ల రాహుదోషం తొలగిపోయి మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.
కత్తి..
కత్తి మీకు నిద్రలో భయంకరమైన కలలు వస్తే, మీరు నిద్రపోయేటప్పుడు మీ దిండు కింద ఇనుముతో తయారుచేసిన చాకు(కత్తి)ని ఉంచాలి. ఇది అలాంటి చెడు కలలను నియంత్రిస్తుంది.
మంచినీటి చెంబు..
మంచం క్రింద లేదా మీ దిండుకు దగ్గర నేలపై నీటితో నింపిన చెంబు రాత్రి పడుకునే ముందు మంచం క్రింద లేదా మీ దిండుకు దగ్గర నేలపై నీటితో నింపిన చెంబును ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఈ రకంగా వాటిని మీ దిండు కింద ఉంచుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు ప్రశాంతమైన నిద్ర వస్తుందని.. ఆ రకంగా మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని కూడా గడపడానికి వాస్తు శాస్త్రం దోహదపడుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/